పోలింగ్ శాతంపై.. ఇప్పుడు మొత్తుకుంటే ఏం ఉపయోగం – ముందే తెలిసినా ఎందుకు మాట్లాడలేదు

ఇప్పుడు మొత్తుకుంటే ఏం ఉపయోగం - ముందే తెలిసినా ఎందుకు మాట్లాడలేదు.. అలాంటిది ఇన్ని కారణాలతో ఓటర్లు ఇతర ప్రాంతాల్లో ఉంటున్నప్పుడు పోలింగ్ శాతం ఎలా పెరుగుతుందని భావిస్తారు..

ghmc voting percentage drops
ghmc voting percentage drops

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓటింగ్ శాతం తక్కువగా నమోదు అవుతుంది.. ఓటర్లు ఇళ్లు దాటి బయటకు రావటం లేదు అని అందరూ ఇప్పుడు మొత్తుకుంటారు. ముఖ్యంగా మీడియా అయితే నెత్తీనోరు బాదుకుంటున్నట్లు చెబుతోంది. అయితే హైదరాబాదీల వెర్షన్ మాత్రం చాలా క్లియర్ గా.. క్లారిటీగా ఉంది. వాళ్లేమంటున్నారో తెలుసుకుందాం..

కరోనా వైరస్ ప్రభావంతో హైదరాబాద్ నుంచి 30 లక్షల మందిపైనే సొంతూళ్లకు వెళ్లిపోయారు. వేలాది ఇళ్లు ఖాళీ అయ్యాయి. ఏ కాలనీలో.. ఎటు చూసినా టూలెట్ బోర్డులే కనిపిస్తున్నాయి. వీళ్లు ఇంకా తిరిగి హైదరాబాద్ రాలేదు. కారణం ఉపాధి, ఉద్యోగం కొల్పోవటమే. ఐటీ ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోం ఇవ్వటంతో వాళ్లు సొంతూరులో ఉండి ఆన్ లైన్ వర్క్ చేస్తున్నారు. హైదరాబాద్ లో ఎవరు ఉన్నారని ఓట్లు వేయటానికి అని ప్రశ్నిస్తున్నారు హైదరాబాదీలు. ఇవన్నీ ప్రభుత్వానికి తెలియకుండానే పోలింగ్ పెట్టిందా.. మీడియాకు తెలియని విషయమా అంటున్నారు.

ఉదాహరణలు తీసుకుంటే థియేటర్లు, మల్లీప్లెక్స్ లు ఎనిమిది నెలలుగా మూతపడ్డాయి. హైదరాబాద్ సిటీ వ్యాప్తంగా 10 వేల మంది వీటిలో పని చేస్తారు. వీళ్లందరూ ఇప్పుడు హైదరాబాద్ లో లేరు కదా.. అదే విధంగా ప్రైవేట్ స్కూల్స్, కాలేజీల్లో పని చేసే లక్షల మంది టీచర్లు సైతం వెళ్లిపోయారు. ఆన్ లైన్ క్లాసులు జరుగుతున్నా.. వారి వారి గ్రామాల నుంచి కనెక్ట్ అవుతున్నారు.. ఈ విషయం ఎవరికీ తెలియంది కాదు కదా..

మరో ముఖ్యమైన విషయం అంటంటే.. వరసగా నాలుగు రోజులు సెలవు వచ్చింది. గురువారం సాయంత్రం, శుక్రవారం ఉదయం హైదరాబాద్ చుట్టుపక్కల అన్ని టోల్ గేట్ల దగ్గర రద్దీ ఉంది.. అంటే లక్షల మంది కూడా వెళ్లిపోయారు. ఈ విషయం తెలిసి ఎలా షెడ్యూల్ ఇస్తారు.. ఎలా ఎన్నికలు పెడతారు అనేది హైదరాబాదీలు ప్రశ్నిస్తున్నారు.

ఇలా చెప్పుకుంటూ పోతే.. ఎన్నో బయటకు వస్తాయి. ఇవన్నీ మీడియా, ప్రభుత్వానికి తెలియంది కాదు. మామూలుగానే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోలింగ్ 50శాతం దాటదు.. అలాంటిది ఇన్ని కారణాలతో ఓటర్లు ఇతర ప్రాంతాల్లో ఉంటున్నప్పుడు పోలింగ్ శాతం ఎలా పెరుగుతుందని భావిస్తారు.. ఇప్పుడు మొత్తుకుంటే ఏం ఉపయోగం – ముందే తెలిసిన ఎందుకు మాట్లాడరు అంటున్నారు ఓటర్లు.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు