ఉప్పాడ సముద్ర తీరంలో బంగారం వేట – వేలాదిగా తరలివస్తున్న జనం

ఉప్పాడ సముద్ర తీరంలో బంగారం వేట - వేలాదిగా తరలివస్తున్న జనం.. తనకు తీరంలో దొరికిన బంగారం ముక్కను చూపిస్తోంది. దీంతో ఇది నిజమే అనుకుని చిన్నా పెద్దా, ఆడా మగా తేడా లేకుండా సముద్ర తీరంలో

Gold mines in uppada sea in kakinada area
Gold mines in uppada sea in kakinada area

అసలే సముద్రం అల్లకల్లోలంగా ఉంది.. తుఫాన్ ప్రభావంతో మత్స్యకారులు వేటకు వెళ్లలేదు.. ఎవరూ సముద్రం వైపు రావొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. అయినా కూడా కాకినాడ సముద్రం తీరంలో సందడే సందడి.. గుంపులు గుంపులు ప్రజలు.. తండోపతండాలు తరలివస్తున్నారు. దీనికి కారణం ఏంటో తెలుసా.. బంగారం.. వాళ్లు చేస్తున్నది బంగారం వేట.

సముద్రం నుంచి బంగారం కొట్టుకువస్తుందని.. తీరంలో బంగారం దొరుకుతుందని ప్రచారం జరిగింది. ఇది ఆ నోట.. ఈ నోట అందరికీ తెలిసిపోయింది. ఇక జనం వేలాది మంది కాకినాడ తీరానికి చేరుకుని.. బంగారం కోసం వెతుకులాట మొదలుపెట్టారు. వీరిలో మత్స్యకారులు ఉండటం విశేషం.

జోరు వాన పడుతున్నా ఏ మాత్రం లెక్కచేయకుండా.. బంగారాన్ని అన్వేషించే పనిలో పడ్డారు. బంగారం ముక్కలు, బంగారం రజను కొట్టుకు వస్తున్నాయని.. ఇది నిజం అంటూ ఓ మహిళ.. తనకు తీరంలో దొరికిన బంగారం ముక్కను చూపిస్తోంది. దీంతో ఇది నిజమే అనుకుని చిన్నా పెద్దా, ఆడా మగా తేడా లేకుండా సముద్ర తీరంలో వేట మొదలుపెట్టారు జనం.

అధికారులు, పోలీసులు ఈ విషయాన్ని లైట్ తీసుకుంటున్నారు. సముద్రం నుంచి ఎలాంటి బంగారం కొట్టుకురావటం లేదని స్పష్టం చేశారు. గతంలో ఎవరైనా సముద్రంలో గల్లంతు అయ్యి చనిపోవటం, ఆత్మహత్య చేసుకోవటం జరిగి ఉంటుందని.. వారి ఒంటిపై బంగారం సముద్రంలో కలిసి ఉంటుందని.. తుఫాన్ కారణంగా అలాంటి చిన్న చిన్న బంగారం ముక్కలు ఏమైనా కొట్టుకు వచ్చి ఉండొచ్చని.. అంతేకానీ సముద్రం లోపల నుంచి బంగారం తీరం వైపు కొట్టుకురావటం అనేది ఏమీ లేదని.. వదంతులు నమ్మొద్దని అధికారులు, పోలీసులు చెబుతున్నారు.

వాళ్లు చెబితే మాత్రం వింటారా ఏంటీ ప్రజలు.. అబ్బే గుంపులు గుంపులుగా ఉప్పాడ తీరంలో బంగారం వేట కొనుసాగుతూనే ఉంది.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు