మద్యం ప్రియులకు శుభవార్త.. నిషా తగ్గించే డివైస్ వచ్చింది.

మద్యం ప్రియులకు శుభవార్త.. నిషా తగ్గించే డివైస్ వచ్చింది.

మద్యం అతిగా సేవించే వారికీ శుభవార్త చెప్పారు కెనడా సైన్టిసులు. అధిక మద్యం తాగడం వలన నిషా ఎక్కువ సమయం ఉంటుంది. ఈ నిషాను తగ్గేంచేందుకు లివర్ ఎంతగానో శ్రమించాల్సి ఉంటుంది. దింతో మద్యం నిత్యం సేవించే వారి లివర్ త్వరగా పాడవుతుంది.

ఇలాంటి వారి సమస్యను అర్ధం చేసుకున్న కెనడాలోని టొరంటో జనరల్ హాస్పిటల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ కు చెందిన జోసెఫ్ ఫిషర్ అనే సైన్టిస్ట్ ఆయన బృందం కలిసి ఓ నూతన తరహా డివైస్‌ను రూపొందించారు. మందు తాగిన వ్యక్తి రక్తంలోని ఆల్కహాల్ ను ఈ డివైస్ కొద్దీ క్షణాల్లోనే వాక్యూమ్ చేస్తుంది. అయితే ఈ ప్రక్రియలో శరీరం నుంచి పెద్ద ఎత్తున కార్బన్ డయాక్సైడ్ కూడా బయటకు పోతుంది ఇలా పోవడం వలన మనిషి సృహ కోల్పోతారు.

తల తిరిగినట్లు ఉంటుంది. ఇటువంటి వాటిని దృష్టిలో ఉంచుకొని ఆ పరికరాన్ని అభివృద్ధి చేశారు. కేవలం ఆల్కహాల్ ని మాత్రమే తీసేవిధంగా డిసైన్ చేశారు. ఇక ప్రస్తుతం మద్యం సేవించిన వారు ఆసుపత్రికి వస్తే డైయలసీస్ చేసి ఆల్కహాల్ ను తొలగిస్తారు.. ఇది చాలా సమయం తీసుకుంది. ప్రస్తుతం జోసెఫ్ బృందం తయారు చేసిన డివైస్ నిమిషాల వ్యవధిలో మత్తు తగ్గిస్తుంది. మనిషిని నార్మల్ స్థితికి తీసుకొస్తుంది.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు