గూగుల్ పే సర్వర్ డౌన్ – నరకం చూస్తున్న కస్టమర్లు

గూగుల్ పే సర్వర్ డౌన్ – నరకం చూస్తున్న కస్టమర్లు

టీ తాగాలన్నా.. ఆ తర్వాత సిగరెట్ ముట్టించాలన్నా.. కొత్తిమీర కట్ట నుంచి కూల్ డ్రింక్ వరకు.. కిరాణా కొట్టు నుంచి రెస్టారెంట్ లో బిల్ పే వరకు.. ఏదైనా సరే టక్ అని మొబైల్ తీసి కొట్టేస్తే సరిపోతుంది.. ఇన్నాళ్లు అలవాటు అయిన ప్రాణం..

సోమవారం నుంచి గిలగిలకొట్టుకుంటుంది. గూగుల్ పే కస్టమర్లు రెండు రోజులుగా సర్వర్ తో ఇబ్బంది పడుతున్నా.. సోమవారం మాత్రం అది పీక్ స్టేజ్ కు వెళ్లింది. గూగుల్ పే నుంచి లావాదేవీలు జరగటం లేదు. సర్వర్ నాట్ కనెక్ట్ అని వస్తుంది. బ్యాంక్ అకౌంట్ ఏమైనా ఇబ్బందా అని చెక్ చేసుకుంటున్నారు కస్టమర్లు.

రెండు రోజులుగా ఉన్న ఇబ్బందులతోనే చిరాకు పుట్టిస్తుంటే.. నవంబర్ 9వ తేదీ సోమవారం మాత్రం పీక్ స్టేజ్ కు వెళ్లింది. అస్సలు ఓపెన్ కావటం లేదు గూగుల్ పే రెగ్యులర్ లా గూగుల్ పే ద్వారా కొనుగోళ్లు చేసే వారు షాపుల దగ్గరకు వెళ్లి ఇబ్బంది పడుతున్నారు.

షాపు యజమానులు సైతం గూగుల్ పే సర్వీస్ బాగోలేదు.. ఫోన్ పే, పేటీఎం చేయండి అంటూ సలహాలు ఇస్తున్నారు. రెండు, మూడు అకౌంట్లు ఉన్నవారు సరే.. ఓన్లీ గూగుల్ పే కస్టమర్లు మాత్రం లబోదిబో అంటున్నారు.

బ్యాంక్ అకౌంట్లు అన్నీ బాగానే ఉన్నాయని.. గూగుల్ సర్వర్ సమస్య వల్లే ఈ ఇబ్బందులు అన్ని బ్యాంక్ సిబ్బంది చెబుతున్నారు. అయ్యా గూగుల్ పే.. నువ్వు వచ్చిన తర్వాత జేబులో రూపాయి కూడా లేకుండా తిరుగుతున్నాం.. సడన్ గా డబ్బులు పెట్టుకుని తిరగాలి అంటే కష్టం.. వెంటనే ఆ సర్వర్ ఏదో బాగుచెయ్యమని కోరుతున్నారు కస్టమర్లు.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు