పెళ్లికి 50 మంది.. చావుకు 20 మంది : తక్కువైనా పర్వాలేదు.. ఎక్కువైతే జైలుకే..

పెళ్లికి 50 మంది.. చావుకు 20 మంది.. తక్కువైనా పర్వాలేదు.. ఎక్కువైతే జైలుకే..

రాబోయే నాలుగు రోజుల్లో పెళ్లిళ్ల సీజన్ మొదలవుతుంది.. మే ఒకటో తేదీ నుంచి మూడు నెలలు మంచి ముహూర్తాలు వచ్చాయి. శుభకార్యాలకు మంచి కాలం అంటున్నారు పండితులు.. ఈ క్రమంలోనే గత ఏడాది కాలంగా కరోనాతో వాయిదా పడిన అన్ని శుభకార్యాలను ఈసారి ఫిక్స్ చేయాలని.. పెళ్లిళ్లు చేసేయాలని డిసైడ్ అయ్యారు చాలా మంది. ఇప్పటికే చాలా మంది ఆయా ఫంక్షన్ హాల్స్, క్యాటరింగ్, ఫొటో షూటింగ్స్, డెకరేషన్ ఇలా అడ్వాన్సులు సైతం ఇచ్చేశారు.. ఇచ్చేస్తున్నారు.

సరిగ్గా ఇదే సమయంలో దేశంలో కరోనా విలయతాండవం చేస్తోంది. రోజుకు మూడున్నర లక్షల కేసులు నమోదు అవుతున్నారు. చావులు 3 వేల వరకు ఉన్నాయి. లక్షల మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ పరిణామాలను దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది.

పెళ్లి లేదా ఇతర ఏ శుభకార్యం అయినా సరే.. 50 మందికి మించకూడదు.. వెయ్యి మంది పట్టే ఫంక్షన్ హాలు తీసుకోండి.. నో ప్రాబ్లమ్ అందులో 50 మంది మాత్రమే ఉండాలి.. అంతకు మంచితే పోలీసులు జరిమానాతోపాటు జైలు శిక్ష విధించే అవకాశం ఉంది. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ఈ నిర్ణయం తీసుకుంటంది కేంద్ర ప్రభుత్వం. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేసింది.

ఇక చావు అనేది మరో ముఖ్య కార్యక్రమం. చివరి చూపుకు ఎంతో ప్రాధాన్యం ఇస్తారు. ఇక నుంచి అంత్యక్రియలకు 20 మంది కంటే ఎక్కువ పాల్గొనకూడదని స్పష్టం చేసింది కేంద్ర ప్రభుత్వం. అది కరోనా మరణం అయినా.. సాధారణ మరణం అయినా లేక మరో అనారోగ్య మరణం అయినా సరే.. 20 మందికి మించి హాజరుకాకూడదని తేల్చి చెప్పింది కేంద్ర ప్రభుత్వం. బాగా తెలిసిన వారు.. వెళ్లకపోతే ఏమనుకుంటారో అని మీరు ఫీల్ అయ్యి వెళితే ఆ తర్వాత బాధిత కుటుంబంతోపాటు మీరు సైతం బాధపడాల్సి వస్తుందని హెచ్చరిస్తోంది కేంద్ర ప్రభుత్వం.

శుభం.. అశుభం అని తేడా లేదా.. ఫంక్షన్ ఏదైనా మంది తక్కువ ఉండాలనేది రూల్ ఇక్కడ.. పెళ్లికి 50 మంది.. చావుకు 20 మంది మాత్రమే ఉండాలి.. మా ఇంట్లో పని వాళ్లే 50 మంది ఉండారని ఓవరాక్షన్ చేయొద్దు అని చెబుతోంది కేంద్రం.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు