పేపర్లు, టీవీల్లోని గుత్తాధిపత్యమే.. డిజిటల్ మీడియాలో రాబోతున్నదా… యూట్యూబ్ కేంద్రం పరిధిలోకి అందుకేనా

యూట్యూబ్, ట్విట్టర్, ఫేస్ బుక్, వెబ్ పోర్టల్స్, గూగుల్ ఏదైనా సరే.. డిజిటల్ అండ్ సోషల్ ప్లాట్ ఫామ్స్.. ఇవి కేవలం టెక్నాలజీ సపోర్టెడ్ ప్లాట్ ఫామ్స్.. ఇందులో ఎవరైనా వెళ్లొచ్చు.. రావొచ్చు.. ఇవి పబ్లిక్ డొమైన్స్.. ప్రజలకు ఫ్రీగా అందుబాటులో ఉంటాయి. అలాంటి వాటిలో వార్తలను ఎలా నియంత్రిస్తారు.. ఎలా కట్టడి చేస్తారు.. ఇదే ఇప్పుడు అందరిలో సందేహాలు రేకెత్తిస్తోంది.

యూట్యూబ్, ట్విట్టర్, ఫేస్ బుక్, వెబ్ పోర్టల్స్ అనేవి ఇన్ఫర్మేషన్ బేస్డ్ ప్లాట్ ఫామ్స్.. కేవలం న్యూస్ కోసం పెట్టినవి కావు. తమ దగ్గర ఉన్న సమాచారాన్ని మరొరకరికి పంపుకోవటానికి ఈజీ వే.. తమ ఇన్ఫర్మేషన్ ప్రపంచానికి చెప్పుకునే అవకాశం ఉన్న ప్లాట్ ఫామ్స్.. న్యూస్ ఛానెల్స్ ను ఎలా నియంత్రించగలరు.. ఎలా కట్టడి చేస్తారు..
రాజకీయ పార్టీలు, నేతలు, సినిమా సెలబ్రిటీలు, పోలీసులు, స్వచ్ఛంధ సంస్థలు, ప్రభుత్వ, ప్రైవేట్ రంగంలోని ప్రతివారు డిజిటల్, సోషల్ మీడియా ద్వారానే సమాచారం ఇస్తున్నారు.. అది కూడా వార్తగా న్యూస్ ఛానళ్లు, పత్రికలు తీసుకుని వేస్తున్నప్పుడు.. సోషల్ మీడియాకు మాత్రం నియంత్రణ కిందకు ఎలా వస్తుంది. ఈ విషయంలో ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.

వార్తా పత్రికలు, న్యూస్ ఛానళ్లు ప్రచురిస్తుంది.. చూపిస్తున్నది అంతా నిజమేనా.. వాళ్లు అబద్ధం రాయరా.. డిజిటల్, సోషల్ మీడియాలోనే తప్పుడు ప్రచారం జరుగుతుందని ఎలా నిర్థారిస్తారు.. ప్రజలకు కనెక్ట్ అయితే అది వైరల్ అవుతుంది.. నెటిజన్లకు నచ్చకపోతే ఎవరూ చూడరు. వార్త, వీడియో ఏదైనా సరే వెంటనే జనంలోకి వెళ్లదు.. ఫేస్ బుక్, గూగుల్ రివ్యూ తర్వాతే పబ్లిక్ అవుతుంది.. అంత పెద్ద నియంత్రణను ఆయా సంస్థలు నిర్వహిస్తున్నాయి.

యూట్యూబ్, ఫేస్ బుక్, గూగుల్, ట్విట్టర్, ఇన్ స్టా ఏదైనా సరే.. న్యూస్ పోర్టల్స్ కు రెవెన్యూ ఇస్తూనే.. ఆయా న్యూస్ డొమైన్స్ నుంచి ప్రమోషన్ కోసం డబ్బులు తీసుకుంటున్నాయి. ఇప్పుడు న్యూస్ ఛానల్స్ కు డబ్బులు ఇవ్వరా.. న్యూస్ ఛానల్స్ ప్రమోషన్ కు అంగీకరించవా.. వేల కోట్ల రూపాయల రెవెన్యూను గూగుల్ వదులుకుంటుందా..
కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలు చూస్తుంటే.. ఇక నుంచి యూట్యూబ్, ఫేస్ బుక్, గూగుల్ న్యూస్, ట్విట్టర్ లాంటి డిజిటల్, సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ అన్నీ కేంద్రం ప్రభుత్వం నియంత్రణలోకి వెళ్లిపోతాయా…
ఇక జర్నలిస్టులకు గడ్డుకాలమేనా.. డిజిటల్, సోషల్ మీడియాలను పెద్ద సంస్థలు మాత్రమే స్థాపించగలరా.. వీటినే నమ్ముకున్న చిన్న జర్నలిస్టుల పరిస్థితి ఏంటీ.
పేపర్లు, టీవీల్లో ఉండే గుత్తాధిపత్యమే మళ్లీ డిజిటల్, సోషల్ మీడియాలో రాబోతున్నదా…

 

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు