తెలంగాణలో మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్..

telangana high court

తెలంగాణ రాష్ట్రంలో ఐదు మున్సిపాలిటీలు, రెండు కార్పొరేషన్లకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఇచ్చిన షెడ్యూల్ ను సవాల్ చేస్తూ.. హైకోర్టులో పిటీషన్ వేశారు కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ. కరోనా తీవ్రంగా ఉన్న ఈ సమయంలో.. ఎన్నికలు వాయిదా వేయాలని.. ఈ దిశగా ఎన్నికల సంఘాన్ని, ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు.

షబ్బీర్ అలీ పిటీషన్ పై విచారణ చేసిన హైకోర్టు.. ఈ పిటీషన్ ను పరిశీలించాలని ఎన్నికల సంఘాన్ని కోరింది. దీనిపై ఎస్ఈసీతోపాటు ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ జూన్ 7వ తేదీకి వాయిదా వేసింది హైకోర్టు.

ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత దానిపై తుది నిర్ణయం ఎన్నికల సంఘానికిదే అని.. దానిపై జోక్యం చేసుకోలేం అని స్పష్టం చేసింది హైకోర్టు. మీ వాదనను ఎస్ఈసీ వినే విధంగా.. మీ పిటీషన్ పరిశీలించాలని మాత్రం చెబుతామని స్పష్టం చేసింది హైకోర్టు.

హైకోర్టు ఆదేశాలతో తెలంగాణలో మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికలపై ఉన్న అన్ని డౌట్స్ క్లియర్ అయిపోయాయి. ఏప్రిల్ 30న పోలింగ్.. మే 3న కౌంటింగ్ జరగనుంది.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు