ప్రేమ, వ్యామోహం మధ్య జరిగే కథ గువ్వ గోరింక

ప్రేమ, వ్యామోహం మధ్య జరిగే కథ గువ్వ గోరింక.. హ్యూమన్ రిలేషన్స్ అనేది వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంటరెస్టింగ్ టాపిక్ ఆన్ ది ఎర్త్.. సినిమా అంటేనే డ్రైవ్ ఆఫ్ హ్యూమన్ ఎమోషన్స్.. ఆల్ హ్యూమన్ రిలేషన్స్ ఆర్ రిఫ్లెక్షన్స్ ఆఫ్ హ్యూమన్

సత్యదేవ్, ప్రీయలాల్, ప్రియదర్శి ప్రధాన పాత్ర దారులుగా.. మోహన్ బమ్మిడి దర్శకత్వంలో.. జీవన్, దాము సంయుక్తంగా నిర్మించిన సినిమా గువ్వ గోరింక. డిసెంబర్ 17న అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ అవుతుంది. హ్యూమన్ రిలేషన్స్ అనేది వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంటరెస్టింగ్ టాపిక్ ఆన్ ది ఎర్త్.. సినిమా అంటేనే డ్రైవ్ ఆఫ్ హ్యూమన్ ఎమోషన్స్.. ఆల్ హ్యూమన్ రిలేషన్స్ ఆర్ రిఫ్లెక్షన్స్ ఆఫ్ హ్యూమన్ ఎమోషన్స్ అంటున్నారు డైరెక్టర్ మోహన్.

ఇప్పుడున్న లైఫ్ స్టైల్ బేస్ చేసుకుని ఫిజికల్‌గా దూరంగా ఉన్న మనసులు, మనస్తత్వాల్లో దగ్గరగా ఉన్న ఒక జంట మెయిన్ ప్లాట్‌గా.. ఫిజికల్‌గా దగ్గరగా ఉన్నా వారి మధ్య చాలా దూరం ఉన్న మరో జంట, అసలు ఈ రిలేషన్‌షిప్స్ అన్నీ సెక్స్ కోసమే అనుకున్న మరో కుర్రో సబ్‌ప్లాట్స్‌గా తీసుకుని ఈ కథ ఉంటుందన్నారు. ఈ మూడు రిలేషన్‌షిప్స్ ప్రాథమికంగా ఒకే విషయాన్ని చెప్తాయని.. అసలు ప్రేమ అంటే ఏంటీ.. ఫిజికల్ గా కలవడమే ప్రేమా లేక మనసులు కలిస్తేనే ప్రేమా లేక ఒకర్ని మరొకరు ఇష్టపడడమా.. ఇంప్రెస్ చేసుకోవడమా.. ఫిజికల్‌గా కలవడమా.. లేకపోతే ఒకర్నొకరు అర్ధం చేసుకోవటమా అనే అంశాలు అన్నింటినీ ఎంతో చక్కగా ఈ సినిమా చూపిస్తుంది అంటున్నారు.

నా గురువు రామ్ గోపాల్ వర్మ దగ్గర సర్కార్ నుంచి రక్తచరిత్ర వరకు నా ప్రయాణంలో చాలా విషయాలు తెలుసుకున్నానని.. ఎలాంటి కథనైనా సినిమాగా మలచొచ్చు అనే పాయింట్ పై.. తక్కువ బడ్జెట్ తో ఎలా తీసినిమా తీయొచ్చు ఈ సినిమా నిరూపిస్తుందన్నారు దర్శకుడు మోహన్ బిమ్మిడి.

సత్యదేవ్, ప్రియదర్శి, మధుమిక, ప్రియాలాల్ ప్రధానపాత్రల్లో అద్భుతంగా నటించారని చెబుతోంది యూనిట్. సురేష్ బొబ్బిలి సంగీతం అందించగా.. సాంబశివరావు ఆర్ట్ డైరెక్టర్ గా వ్యవహరించారు.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు