హ్యాపీ బర్త్ డే కరోనా వైరస్

పుట్టిన రోజు సందర్భంగా కన్నీటి నివాళి అర్పించటం తప్పితే ఏం చేయగలం..

కరోనా.. కరోనా.. కరోనా.. 2020 సంవత్సరం మొత్తాన్ని నాశనం చేసింది. ప్రజలను చంపుతోంది. ఇంట్లో ఉండలేం.. బయటకు రాలేం.. ఉద్యోగాలను, ఉపాధిని ఆగం చేసింది ఈ మహమ్మారి కరోనా. అలాంటి వైరస్ పుట్టినరోజు చేసుకుంటోంది. 2019, నవంబర్ 17వ తేదీన చైనాలో మొదటి కరోనా కేసును అధికారికంగా ప్రకటించారు. చైనాలోని హుబీ ప్రావిన్స్‌కు చెందిన 55 ఏళ్ల వ్యక్తి శరీరంలో కరోనా వైరస్ ఉన్నట్లు గుర్తించి ట్రీట్ మెంట్ మొదలుపెట్టారు.

నవంబర్ 17వ తేదీన చైనాలో మొదటి కేసు ప్రకటన తర్వాత.. ఖండాలు, దేశాలు దాటి ప్రపంచ జనాన్ని కకావికలం చేసింది. రోజుకు ఒక్క కేసు నుంచి లక్షల సంఖ్య వరకు చేరింది. ప్రపంచవ్యాప్తంగా లక్షల మందిని చంపింది.. చంపుతూనే ఉంది. 2020, నవంబర్ 17వ తేదీ నాటికి.. అంటే ఏడాది కాలంలో ప్రపంచవ్యాప్తంగా 6 కోట్ల మంది ఈ వైరస్ బారిన పడితే.. 14 లక్షల మంది చనిపోయారు.. 4 కోట్ల కరోనాను జయించారు.

ఇది అధికారిక లెక్కలు మాత్రమే. కరోనా వైరస్ వచ్చి పోయినట్లు తెలియని వారి సంఖ్య కోట్లలో ఉంది. ఎంతో మంది సెలబ్రిటీలు, సామాన్య జనం ఈ వైరస్ బారిన పడి చచ్చిపోయారు కూడా.
కరోనా వైరస్ మొదటి పుట్టిన రోజు సందర్భంగా కన్నీటి నివాళి అర్పించటం తప్పితే ఏం చేయగలం..

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు