సీఎం కేసీఆర్ తో మంత్రి హరీశ్ రావు భేటీ ?

సీఎం కేసీఆర్ తో మంత్రి హరీశ్ రావు భేటీ ?

దుబ్బాక నియోజకవర్గంలో ఓటమికి బాధ్యత నాదే అని ఒప్పుకున్నారు మంత్రి హరీశ్ రావు. ఓటమిపై సమీక్షించుకుని ముందుకు సాగుతాం అని.. కార్యకర్తలు, నేతలతో చర్చించి అప్రమత్తం అవుతాం అని ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే సీఎం కేసీఆర్ తో మంత్రి హరీశ్ రావు భేటీ అయినట్లు వార్తలు వస్తున్నాయి.

ప్రగతిభవన్ లో మంత్రి హరీశ్ రావు

Harish Rao: Harish Rao could be back in KCR cabinet | Hyderabad News -  Times of India

ప్రగతిభవన్ లో మంత్రి హరీశ్ రావు.. దుబ్బాక ఓటమికి కారణాలను సీఎం కేసీఆర్ కు వివరించినట్లు సోషల్ మీడియా కోడై కూస్తోంది. దుబ్బాకలో టీఆర్ఎస్ పార్టీ ఓటమికి ఎలా జరిగింది.. ప్రజల్లో వ్యతిరేకతకు కారణాలు ఏంటీ అనేది పూర్తి వివరాలను సీఎం కేసీఆర్ కు వివరించారంట. ఏయే శక్తులు తెర వెనక.. తెర ముందు పని చేశాయి.. బీజేపీ చేసిన ప్రచారాన్ని ప్రజలు ఎందుకు నమ్మారు అనే వివరాలను వివరించారంట హరీశ్ రావు.

టీఆర్ఎస్ పార్టీ ఇస్తున్న పెన్షన్లు

టీఆర్ఎస్ పార్టీ ఇస్తున్న పెన్షన్లు, సంక్షేమ పథకాలను కేంద్రంలోని మోడీ ఇస్తున్నాడని దుబ్బాక ప్రజలు నమ్ముతున్నట్లు చెప్పారంట. చనిపోయిన సిట్టింగ్ ఎమ్మెల్యేపై సానుభూతి ఎందుకు లేదు.. అదే విధంగా రెండోసారి పోటీకి దిగిన బీజేపీ అభ్యర్థి సానుభూతి ఎలా వచ్చింది అనే అంశాలపైనా చర్చ జరిగినట్లు చెబుతున్నారు. దుబ్బాకలో పార్టీ ఓటమి.. పార్టీపై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అనేది మంత్రి హరీశ్ రావుకు తెలియని కాకపోయినా..

see this also :-

ఆయన రాజకీయ వ్యూహ చరిత్రలో ఫస్ట్ టైం ఓడిపోవటం పార్టీలోనే పెద్ద చర్చకు దారితీసింది. సీఎం కేసీఆర్ తో మంత్రి హరీశ్ రావు భేటీ అని సోషల్ మీడియాలో ఇంత రచ్చ జరుగుతున్నా.. అధికార టీఆర్ఎస్ పార్టీ నుంచి అధికారిక ప్రకటన అయితే రాలేదు.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు