మీ సేవ కేంద్రం క్యూలైన్ లో వృద్ధురాలి మృతి – సిటీ అంతా అల్లకల్లోలం – తోపులాటలు

ప్రజలు బారులు తీరారు. కొన్ని సేవా కేంద్రాలను ప్రజలకు పోలీసుల మధ్య వాగ్వాదం జరిగింది

హైదరాబాద్ సిటీ వ్యాప్తంగా.. 24 నియోజకవర్గాలు, 150 డివిజన్ల పరిధిలోని మీ సేవ కేంద్రాలు అన్నీ కిక్కిరిపోయాయి. తెల్లవారుజాము నుంచే వేలాది మంది వరద సాయం అప్లికేషన్ ఇవ్వటానికి బారులు తీరారు. ఉదయం 10 గంటలకు మీ సేవ కేంద్రం తెరుస్తారని తెలిసినా.. భారీగా తరలివచ్చారు బాధితులు. అప్లికేషన్ అందించటానికి ఎగబడ్డారు. చాలా కేంద్రాల్లో తోపులాటలు జరిగాయి.

మరికొన్ని కేంద్రాల్లో వాగ్వావాదాలు.. మరికొన్ని సెంటర్లలో గంటల కొద్దీ క్యూలైన్లలో వేచి ఉన్నారు.. ఒకేసారి రద్దీ పెరగటంతో మీ సేవ కంప్యూటర్ సర్వర్లు డౌన్ అయ్యాయి. కంప్యూటర్లు మొరాయించాయి.

గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని మీ సేవ కేంద్రం దగ్గర మున్నవర్ ఉన్నిస అనే 50 ఏళ్ల వృద్ధురాలి సొమ్మసిల్లి పడిపోయింది. వెంటనే ఆస్పత్రికి తరలించారు. పరిశీలించిన డాక్టర్లు వృద్ధురాలు మృతి చెందిందినట్లు ప్రకటించారు. ఈమె హకీంపేట్ కుంట వాసిగా గుర్తించారు పోలీసులు.

రాజేంద్రనగర్ మండలం శంషాబాద్ మండల పరిధిలో మీసేవ కేంద్రాల దగ్గర వరద బాధితుల సహాయం కోసం ప్రజలు బారులు తీరారు. కొన్ని సేవా కేంద్రాలను ప్రజలకు పోలీసుల మధ్య వాగ్వాదం జరిగింది.

కొన్ని ప్రాంతాల్లోని మీ సేవ కేంద్రాల్లో ఆంధ్ర బ్యాంక్ అకౌంట్ ఉంటే ఫామ్ తీసుకోవడం లేదంటూ ఆందోళన చేశారు బాధితులు

చాలా కేంద్రాల్లో సర్వర్లు మొరాయించటంతో.. మీ సేవ కేంద్రం మూసివేసి వెళ్లిపోయారు నిర్వహకులు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు వరద బాధితులు

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు