హైవే జామ్.. బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు రద్దీ.. సొంతూళ్లకు హైదరాబాద్ జనం

heavy rush in hyderabad

మే 12వ తేదీ నుంచి తెలంగాణలో లాక్ డౌన్ ప్రకటన వచ్చిన వెంటనే.. హైదరాబాదీలు మొత్తం అలర్ట్ అయ్యారు. ఫ్యామిలీలు అంతా సొంతూళ్లకు పయనం అయ్యారు. 10 రోజులు మాత్రమే లాక్ డౌన్ అని ప్రకటించినా.. అది కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉన్నాయనే ఫీలింగ్ లో ఉన్నారు జనం. నెలాఖరు వరకు లాక్ డౌన్ ఉంటుందనే స్పష్టమైన అభిప్రాయానికి వచ్చిన జనం.. సొంతూళ్లకు వెళ్లిపోతున్నారు.

హైదరాబాద్ రోడ్లపై ఒక్కసారిగా ట్రాఫిక్ పెరిగింది. బస్టాండ్, రైల్వేస్టేషన్లకు జనం క్యూ కట్టారు. MGBS బస్టాండ్ అయితే రద్దీగా మారింది. బస్సుల కోసం ఎగబడుతున్నారు జనం. సామాజిక దూరం ఏమీ లేదు.. బస్సులో సీటు దొరికితే చాలు అనుకుంటుున్నారు. ముఖ్యంగా కరీంనగర్, అదిలాబాద్, మహబూబ్ నగర్, వరంగల్ ప్రాంతాలకు వెళ్లే బస్సులు అన్నీ ఫుల్ అయ్యాయి.

ఇక దూరప్రాంతాలు అయిన ఏపీతోపాటు ఇతర రాష్ట్రాలకు వెళ్లే వారు సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ కు వెళ్లారు. అయితే రిజర్వేషన్ టికెట్ ఉన్నోళ్లకు మాత్రమే ఎంట్రీ ఇస్తున్నారు అధికారులు. జనరల్ బోగీలు లేవని.. కచ్చితంగా రిజర్వేషన్ ఉండి తీరాల్సిందే అంటున్నారు. లేకపోతే రైలు ఎక్కటానికి అనుమతి లేదు అని చెబుతున్నారు. ఏపీలో సైతం లాక్ డౌన్ కఠినంగా ఉండటంతో.. ఇప్పుడు అందరూ రైళ్లలో ఏపీలోని వివిధ జిల్లాలకు వెళ్లేందుకు క్యూ కట్టారు.

హైదరాబాద్ నుంచి తెలంగాణ జిల్లాలకు వెళ్లే రహదారులు వాహనాలతో ఒక్కసారిగా రద్దీగా మారాయి. వరంగల్, కరీంనగర్, మెదక్, కర్నూలు వైపు వెళ్లే రహదారులతో వాహనాలతో ఒక్కసారిగా రద్దీ అయ్యాయి. చాలా మంది సొంత వాహనాల్లో వెళ్లిపోతున్నారు.

ఇక ఏపీకి వెళ్లాలనుకునే వారు సైతం ప్లానింగ్ లో బిజీ అయ్యారు. ఉదయం 6 నుంచి 12 గంటల మధ్య ఏపీలోకి ఎంట్రీ ఉండటంతో.. హైదరాబాద్ లో రేపు ఉదయం 4, 5 గంటల మధ్య బయలుదేరి.. ఏపీ సరిహద్దుల్లోకి 6, 7 గంటలకు రీచ్ అయ్యే విధంగా ప్లానింగ్ చేసుకుంటున్నారు ఆ ఆరు గంటల్లో ఏపీలోకి ఎంట్రీ అయితే పాస్ అవసరం లేదు. ఈ టైమింగ్స్ ఆధారంగానే హైదరాబాద్ నుంచి ఏపీకి వెళ్లేవారు ప్లానింగ్ చేసుకుంటున్నారు.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు