ఎటు చూసినా శ్రద్ధాంజలి బోర్డులు : విజయవాడలో ప్రతి వీధిలో ఇవే దృశ్యాలు-భయానకంగా పరిస్థితులు

vijayawada roads

కరోనా ఎవరు ఉన్నారు.. ఎవరు పోయారు.. ఇంకెంత మందిని ఈ కరోనా బలి తీసుకుంటుంది.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయవాడ జనం మాట ఇది. జనం మాట ఎలా ఉన్నా.. వాస్తవ పరిస్థితి వారి మాటకు ఏ మాత్రం భిన్నంగా లేదు..

విజయవాడలో ఏ వీధి చూసినా.. ఎక్కడ చూసినా శ్రద్ధాంజలి బోర్డులు కనిపిస్తున్నాయి. ప్రతి వీధిలో ఒకటీ అరా కనిపిస్తూనే ఉన్నాయి. ఇంత మంది పోయారా అని నోరెళ్లబెట్టాల్సిన పరిస్థితి అక్కడ జనానిది.

కరోనాతో చనిపోయారు.. అనారోగ్యంతో చనిపోయారా అనేది స్పష్టంగా చెప్పకపోయినా.. విజయవాడలో విస్తృతంగా కనిపిస్తున్న శ్రద్దాంజలి బోర్డు మాత్రం కలిచివేస్తున్నాయి. ఉదయం ఉన్న వాళ్లు మధ్యాహ్నానికి ఉండటం లేదు.. రాత్రికి ఉన్న వాళ్లు ఉదయానికి ఉండటం లేదు.. ఇలాంటి మాటలు కొందరి నుంచి రావటం ఆశ్చర్యానికి గురి చేస్తుంది.

మరోనా మొదటి విడతలో మరణాలు చాలా చాలా తక్కువగా ఉన్నాయి. మనకు తెలిసిన వాళ్లు ఎవరూ పోలేదు.. ఈసారి అలా కాదు.. మన చుట్టూనే.. మనకు తెలిసిన వాళ్లు చాలా మంది కరోనా బారిన పడ్డారు.. కొంత మంది చనిపోయారు కూడా.. ఇలాంటి మాటలు మన ఫోన్లలో తరచూ వినిపిస్తూ ఉన్నాయి. పరిస్థితి ఎంత దారుణంగా ఉందీ అంటే.. మన చుట్టాలు, బంధువులు, ఫ్రెండ్స్ తో ఎవరితో మాట్లాడినా సరే.. వాళ్లకు తెలిసిన వారు కచ్చితంగా ఒకరు అయినా చనిపోయారు అనే మాట వారి నుంచి వింటూ వస్తున్నాం..

విజయవాడలో ఏ వీధి చూసిన శ్రద్ధాంజలి బోర్డులే అని బాధపడకండీ.. ప్రతి గ్రామంలో.. ప్రతి పట్టణంలో… ఏపీ, తెలంగాణలో సిట్యువేషన్ ఇలాగే ఉంది. ఈసారి కరోనా మరణాలు బాగా పెరిగాయి.. బాధితుల సంఖ్య అంతకు పది ఇంతలు ఉంది. కరోనా సెకండ్ వేవ్ మొదలయ్యి నెల రోజులు అవుతుంది.. ఇప్పటికీ అత్యవసరంగా ఉపయోగించే రెడిమిసివర్ ఇంజక్షన్ మార్కెట్ కు అరికట్టలేకపోయింది.. వాస్తవ ధరకు అమ్మలేకపోతుంది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం.. దేశంలో దుస్థితి ఎలా ఉందో చెప్పటానికి ఇంత కంటే సాక్ష్యం ఏం కావాలి…

తెలుగు మీడియాలో మూడు రోజులుగా కరోనా వార్తలే లేకపోగా.. కరోనా కేసులు తగ్గిపోయాయి అంటూ బ్రేకింగ్ వేశారు.. మంచిది.. మీరు అాలాగే ఉండండి.. ఉంటారని కూడా మాకు తెలుసు.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు