ఏకగ్రీవాలు ఒకే అన్నప్పుడు.. జనసేన పిటీషన్ కు విలువ ఎంత?

ఏకగ్రీవాలు ఒకే అన్నప్పుడు.. జనసేన పిటీషన్ కు విలువ ఎంత? అది స్వతంత్ర సంస్థ అని గతంలో సుప్రీంకోర్టు, హైకోర్టు తీర్పులు ఉన్న క్రమంలో.. జనసేన పిటీషన్ పై

high court judgement on Andhra Pradesh parishad elections on janasena petition
high court judgement on Andhra Pradesh parishad elections on janasena petition

ఆంధ్రప్రదేశ్ లో వరస ఎన్నికల హడావిడి కనిపిస్తుంది. నిమ్మగడ్డ హయాంలో ఎన్నికలు పెట్టాలంటూ డిమాండ్ చేసి కోర్టుల వరకు వెళ్లిన టీడీపీ, జనసేన పార్టీలు ఇప్పుడు యూటర్న్ తీసుకున్నాయి. ఎన్నికలకు తొందర ఎందుకు అంటున్నాయి. పంచాయతీ, పురపాలక ఎన్నికల్లో వచ్చిన ఫలితాలను చూసి.. పరిషత్ ఎన్నికలపై గుర్రుగా ఉన్నాయి. 2020 మార్చి నెలలో వాయిదా పడిన పరిషత్ ఎన్నికలను వేగంగా పూర్తి చేయాలని అధికార పార్టీ డిమాండ్ కు అనుకూలంగానే.. కొత్త ఎస్ఈసీగా బాధ్యతలు స్వీకరించిన మొదటి రోజే పరిషత్ షెడ్యూల్ రిలీజ్ చేసి హీట్ పెంచారు నీలం సాహ్ని.

ఇక్కడ అందరికీ వస్తున్న ఏకైక డౌట్ ఒకటి ఉంది. పరిషత్ ఎన్నికలపై హైకోర్టులో కేసు ఉంది.. విచారణ పూర్తయ్యింది.. తీర్పు రిజర్వ్ లో ఉంది. ఇలాంటి సమయంలో షెడ్యూల్ ఎలా రిలీజ్ చేస్తారు అనేది పాయింట్. హైకోర్టులో పిటీషన్ వేసింది ఎవరో తెలుసా జనసేన పార్టీ. పరిషత్ ఎన్నికలు వాయిదా పడ్డాయి కాబట్టి.. మళ్లీ మొదటి నుంచి చేపట్టాలని.. మళ్లీ నామినేషన్లు స్వీకరించాలనేది జనసేన పార్టీ వేసిన పిటీషన్.

ఈ పిటీషన్ పెండింగ్ లో ఉండగానే.. పరిషత్ ఎన్నికల్లో ఒకే ఒక్క నామినేషన్ దాఖలు అయిన చోట.. ఏకగ్రీవాలు ప్రకటించాలని హైకోర్టు తీర్పు ఇచ్చింది. అంటే ప్రక్రియ కొనసాగుతుందని స్పష్టం చేసినట్లే.. నామినేషన్ల ప్రక్రియకు ఆమోదం లభించినట్లే.

ఈ తీర్పు కూడా నిమ్మగడ్డ రమేశ్ కుమార్ అధికారంలో ఉండగానే వచ్చింది. అంటే పరిషత్ ఎన్నికల ప్రక్రియ మళ్లీ మొదటి నుంచి నిర్వహించే అవకాశం లేదని హైకోర్టు విస్పష్టంగా తేల్చేంది.

ఇలాంటి సమయంలో ఏప్రిల్ 3వ తేదీన జనసేన పార్టీ దాఖలు చేసిన పిటీషన్ పై వచ్చే తీర్పు ఎలా ఉండబోతుంది అనేది స్పష్టం అయిపోయింది. ఏకగ్రీవాలకు హైకోర్టు ఆమోదం లభించిన క్రమంలో.. ఎక్కడ అయితే పరిషత్ ఎన్నికలకు బ్రేక్ పడిందో.. అక్కడి నుంచే మొదలు పెట్టటానికి షెడ్యూల్ రిలీజ్ చేసింది ఎస్ఈసీ. ఆ తర్వాత ఆల్ పార్టీ మీటింగ్ పెట్టారు. ఇదంతా రొటీన్ ప్రక్రియే అయినా.. ఎస్ఈసీ నిర్ణయంలో ఎవరూ జోక్యం చేసుకోవటానికి వీల్లేదని.. అది స్వతంత్ర సంస్థ అని గతంలో సుప్రీంకోర్టు, హైకోర్టు తీర్పులు ఉన్న క్రమంలో.. జనసేన పిటీషన్ పై తీర్పు ఎలా ఉంటుందో అందరూ ఈజీగానే ఊహించేస్తున్నారు.

మొత్తంగా ఏప్రిల్ 3వ తేదీన హైకోర్టు తీర్పును పట్టించుకోకుండా అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దూకుడుగా ముందుకు వెళుతుంటే.. ఆ తర్వాత స్పందిస్తామంటూ తీరిగ్గా ఉన్నాయి ప్రతిపక్షాలు.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు