స్థానిక ఎన్నికలు.. ప్రభుత్వానికి చుక్కెదురు

స్థానిక ఎన్నికలు.. ప్రభుత్వానికి చుక్కెదురు

ఆంధ్ర ప్రదేశ్ లో స్థానిక ఎన్నికల అంశం హాట్ టాపిక్ గా మారింది. ప్రభుత్వానికి, ఎస్ఈసికి మధ్య సఖ్యత లేకపోవడంతో ఎన్నికల నిర్వహణపై స్పష్టత రావడం లేదు. ఇక ఈ నేపథ్యంలోనే స్థానిక సంస్థల ఎన్నికలపై స్టే విధించాలని ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది.

దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం స్టే ఇవ్వడం కుదరదని తేల్చేసింది. కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ను హైకోర్టు ఆదేశించింది. ఇందుకు సంబంధించిన తదుపరి విచారణను ఈ నెల 14కు వాయిదా వేసింది.

ఇక కరోనా నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేసిన నాటినుంచి రాష్ట్ర ప్రభుత్వానికి, ఎస్ఈసికి మధ్య తీవ్ర అంతరం ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం ఎస్ఈసిని తొలగించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేసింది.

కాగా ప్రభుత్వ ఎత్తుగడలు మొత్తం చిత్తవడంతో ఎస్ఈసీ తొలగింపు కష్టంగా మారింది. పలు కోర్టుకేసుల విచారణ అనంతరం రమేష్ కుమార్ తిరిగి విధులకు వెళ్లారు. అయితే ఇయ్యన పదవి కాలం వచ్చే ఏడాది ఫిబ్రవరి చివరకు ముగుస్తుంది. దింతో ఈ లోపే ఎన్నికలు నిర్వహించాలని రమేష్ కుమార్ ప్రయత్నాలు చేస్తున్నారు. కాగా రమేష్ కుమార్ ప్రతిపాదనను వైసీపీ ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తుంది.

ఇక మంత్రులైతే ఎస్ఈసీ ప్రత్యేక్షంగా విమర్శలు గురిపిస్తున్నారు.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు