జెడ్పీ ఎన్నికలపై హైకోర్టు తీర్పు వాయిదా

zptc and mptc elections in ap

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగే జెడ్పీ ఎన్నికల షెడ్యూల్ సవాల్ చేస్తూ.. టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు దాఖలు చేసిన అత్యవసర పిటీషన్లపై విచారణ చేసిన హైకోర్టు.. తీర్పును వాయిదా వేసింది. ఇప్పటికే షెడ్యూల్ ను ప్రకటించిన ఎస్ఈసీ.. ఏప్రిల్ 8న పోలింగ్, 10న కౌంటింగ్ ఏర్పాట్లలో బిజీగా ఉంది. బ్యాలెట్ బాక్సులు, పేపర్లు సిద్ధం చేస్తూ ఉంది.

జెడ్పీ ఎన్నికలను మొదటి నుంచి నిర్వహించాలంటూ ఆయా పార్టీలు దాఖలు చేసిన పిటీషన్లపై శనివారం వాదనలు విన్న హైకోర్టు.. ప్రభుత్వం, ఎస్ఈసీ తరపు వాదనలతోపాటు తీర్పును వాయిదా వేసింది. ఇప్పటికే ఎన్నికల గడువు సమీపిస్తున్న సమయంలో.. హైకోర్టు నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది. శనివారం ఏ సమయంలో అయినా తీర్పు వస్తుందని భావించినా.. అలాంటిది ఏమీ రాకపోవటంతో ప్రతిపక్ష పార్టీలు నిరాశ వ్యక్తం చేశాయి.

ఏప్రిల్ 4వ తేదీ అత్యవసరంగా తీర్పు ఇస్తారా లేక సోమవారం ఎస్ఈసీ వాదనలు విని తీర్పు ఇస్తారా అనేది చూడాలి. జెడ్పీ ఎన్నికలను టీడీపీ బహిష్కరించటంతో ఆ పార్టీకి ఎలాంటి టెన్షన్ లేదు. ఎన్నికల ప్రక్రియను వీలైనంత త్వరగా కంప్లీట్ చేయాలని భావిస్తున్న ఎస్ఈసీ, ప్రభుత్వం మాత్రం.. హైకోర్టు తీర్పు తమకు అనుకూలంగా వస్తుందనే ఉద్దేశంతో ఏర్పాట్లు చేసుకుంటుంది

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు