8న జరగాల్సిన జెడ్పీ ఎన్నికలకు హైకోర్టు బ్రేక్ – కొత్త నోటిఫికేషన్ లేదు

8న జరగాల్సిన జెడ్పీ ఎన్నికలకు హైకోర్టు బ్రేక్ - కొత్త నోటిఫికేషన్ లేదు

ఏప్రిల్ 8వ తేదీ జరగాల్సిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలపై స్టే విధించింది ఏపీ హైకోర్టు. ఇప్పటికే ఎన్నికలకు సర్వం సిద్ధం అయిన రాష్ట్ర ఎన్నికల సంఘానికి బ్రేక్ వేసింది హైకోర్టు. ఇదే సమయంలో కొత్త నోటిఫికేషన్ అవసరం లేదని స్పష్టం చేసింది. తర్వాత విచారణను ఏప్రిల్ 15వ తేదీకి వాయిదా వేసింది హైకోర్టు.

షెడ్యూల్ ఇచ్చే సమయంలో కనీసం నాలుగు వారాల సమయం ఉండాలన్న నిబంధన అమలు కాలేదని టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు దాఖలు చేసిన పిటీషన్లపై వాదన వినిపించారు లాయర్లు. దీనిపై అఫిడవిట్ దాఖలు చేయాలని ఎస్ఈసీని ఆదేశిస్తూ.. ఏప్రిల్ 8వ తేదీన జరగాల్సిన ఎన్నికలపై స్టే విధించింది హైకోర్టు. సుప్రీంకోర్టు కోడ్ ప్రకారం నాలుగు వారాల గడువు ఇవ్వాలన్న నిబంధన అమలు కాలేదంటూ.. స్టే విధించింది హైకోర్టు.

516 జెడ్పీటీసీ, 7వేల 258 ఎంపీటీసీలకు ఏప్రిల్ 8వ తేదీన పోలింగ్.. 10న కౌంటింగ్ నిర్వహించటానికి ఎస్ఈసీ షెడ్యూల్ విడుదల చేసింది. ఆగిపోయిన ఎన్నికలకు కొనసాగింపుగానే ఈ షెడ్యూల్ ఇచ్చినట్లు ఎస్ఈసీ అంటోంది.

See also : కేసులన్ని గెలిచిన నిమ్మగడ్డ – మొదటి కేసే ఓడిపోయిన నీలం సాహ్నీ

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు