ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కోర్టు – యధా విధిగా ఎంపీటీసీ ,జడ్పీటీసీ ఎన్నికలు

వ తేదీన యధావిధిగా ఎంపీటీసీ ,జడ్పీటీసీ ఎన్నికలు....

ఏప్రిల్ 8న జరగాల్సిన్ MPTC,ZPTC ఎన్నికలపై ఏపీ ఎన్నికల కమీషన్ ఇచ్చిన నోటిఫికేషన్ పై హైకోర్టు సింగిల్ బెంచ్ జడ్జీ ఇచ్చిన స్టే చెల్లదని హైకోర్టు డివిజన్ బెంచ్ ఆదేశాలు జారీ చేసింది. గతంలో ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారమే ఏప్రిల్ 8న ఎంపీటీసీ ,జడ్పీటీసీ ఎన్నికలను నిర్వహించాలని ఆదేశాలు ఇచ్చింది. అయితే ఫలితాలను మాత్రం తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ప్రకటించొద్దని సూచించింది.

హై కోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఏప్రిల్ 8న యధా విధిగా ఎంపీటీసీ ,జడ్పీటీసీ ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల ప్రచారం ముగిసిన, ఎన్నికలకు సర్వం సిద్ధం అయిన చివరి నిమిషంలో స్టే ఇవ్వడం సరైన నిర్ణయం కాదని కోర్టు అభిప్రాయపడినట్టు తెలుస్తుంది. అయితే 10వ తారీఖున లెక్కింపు ప్రక్రియ చేయవద్దు అనే ఆదేశాలపై మరోసారి ఎన్నికల సంఘం కోర్టును ఆశ్రయించనుంది.

ఇక కోర్టు తీర్పు కోసం ఎదురుచూస్తున్న అధికారులు, ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ లభించడంతో పోలింగ్ కేంద్రాలకు సిబ్బందిని తరలిస్తున్నారు. కొద్ది సమయం మాత్రమే మిగిలి ఉన్నందున అధికారులు ఆఘామేఘాల మీద పనులు మొదలు పెట్టారు.

కోర్టులను అడ్డంపెట్టుకోని ఎన్నికలను అడ్డుకోవడానికి చూసిన జనసేన,తెలుగుదేశం నేతలకు ఎదురుదెబ్బ తగిలిందని, ఆ కోర్టులే వారికి సరైన సమాధానం చెప్పాయని, వైసీపీ సీనియర్ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.

 

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు