ఊహించని స్థాయిలో నాగార్జునసాగర్ ఉప ఎన్నికలో పోటెత్తిన పోలింగ్.. గెలుపుపై ఎవరి ధీమా వాళ్లదే..

నాగార్జునసాగర్ ఉప ఎన్నికలో పోటెత్తిన పోలింగ్.. గెలుపుపై ఎవరి ధీమా వాళ్లదే..

తెలంగాణ రాష్ట్రం నాగార్జునసాగర్ ఉప ఎన్నికలో పోలింగ్ భారీగా నమోదైంది. ఏప్రిల్ 17వ తేదీ రాత్రి 7 గంటలకు పోలింగ్ ముగియగా.. సాయంత్రం 6 గంటల వరకు 84.32 శాతం నమోదైంది. ఉప ఎన్నికలో ఉత్సాహంగా పాల్గొన్నారు ఓటర్లు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో 86.62 శాతం ఓటింగ్ నమోదైంది. 2021 ఉప ఎన్నిక పూర్తి ఓటింగ్ శాతం ఇంచుమించు 86 శాతం వరకు నమోదు అయ్యే అవకాశం ఉంది.

నాగార్జునసాగర్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ పార్టీ తరపున నోముల భగత్, కాంగ్రెస్ పార్టీ నుంచి జానారెడ్డి, బీజేపీ నుంచి రవి నాయక్ పోటీలో ఉన్నారు. ఈ ముగ్గురి మధ్యే పోటీ జరిగింది. టీఆర్ఎస్ సిట్టింగ్ స్థానం కావటంతో ఆ పార్టీ చాలా సీరియస్ గా తీసుకుంది ఎన్నికలను. ఇక కాంగ్రెస్ సీనియర్ నేత, చాలాసార్లు సాగర్ నుంచి గెలిచిన జానారెడ్డి.. ఈసారి గెలిచి తన సత్తా చాటాలని తీవ్ర ప్రయత్నాలు చేశారు.

సాగర్ ఉప ఎన్నిక పోలింగ్ లో 80 శాతంపైనే ఓటింగ్ నమోదు కావటం.. ఉప ఎన్నికలో భాగా ఓటింగ్ పడటంతో.. ప్రభుత్వ వ్యతిరేక ఓటు ద్వారా గెలుస్తానని ధీమాలో ఉన్నారు జానారెడ్డి. పోలింగ్ శాతం పెరిగితే.. మెజార్టీ భారీగా ఉంటుందని టీఆర్ఎస్ పార్టీ అంటోంది.

2018 ఎన్నికల్లో నోము నర్సింహయ్య 7 వేల ఓట్ల మెజార్టీతో జానారెడ్డిపై విజయం సాధించారు. ఇప్పుడు ఎంత మెజార్టీతో ఎవరు గెలుస్తారు అనేది ఉత్కంఠగా ఉంది. పోలింగ్ శాతం భారీగా ఉండటంతో ఎవరి ధీమా వాళ్లు వ్యక్తం చేస్తున్నారు విజయంపై..

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు