ఎకరం భూమి రూ.107 కోట్లు – ఏపీలో దేశంలోనే అత్యధిక రికార్డ్ ధర

ఎకరం భూమి రూ.107 కోట్లు - ఏపీలో దేశంలోనే అత్యధిక రికార్డ్ ధర

తెలంగాణ, హైదరాబాద్ లో ఎకరం భూమి అమ్ముకుంటే.. ఏపీలో రెండు, మూడు ఎకరాలు కొనుక్కోవచ్చు.. ఇటీవల తెలంగాణ సీఎం కేసీఆర్ వ్యాఖ్యలు ఇవి. మాటలు – చేతలకు భిన్నంగా ఉంది వాస్తవ పరిస్థితి. ఏపీలో భూముల ధరలు దేశంలోనే అత్యధికంగా ఉన్నాయి. ఎకరా వందల కోట్ల రూపాయలు పలుకుతుంది. ఎక్కడో.. ఏంటో వివరంగా తెలుసుకుందాం.

ఆంధ్రప్రదేశ్ పరిపాలన రాజధాని అయిన విశాఖపట్నంలో ఇప్పుడు ఎకరా భూమి అక్షరాల 107 కోట్ల రూపాయలు. మీరు వింటున్నది అక్షర సత్యం. ఈ ధర పెట్టింది కూడా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే. విశాఖపట్నం బీచ్ కు అత్యంత సమీపంలో.. ప్రభుత్వానికి 13.59 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఈ భూమిని సీఎం జగన్ ప్రభుత్వం ఏ కంపెనీకో కట్టబెట్టకుండా.. ఆన్ లైన్ ద్వారా వేలం వేయాలని నిర్ణయించింది. ఆన్ లైన్ వేలాన్ని ప్రైవేట్ కంపెనీకి కాకుండా.. కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన నేషనల్ బిల్డింగ్స్ కన్ స్ట్రక్షన్ కార్పొరేషన్ కంపెనీకి అప్పగించింది.

ఎంతో పారదర్శకంగా భూముల వేలాన్ని.. కేంద్ర ప్రభుత్వ సంస్థతో కలిసి బిల్డ్ ఏపీ ప్రాజెక్ట్ కింద ఏపీ ప్రభుత్వం భూముల అమ్మకాన్ని చేపట్టింది. ఒక్కో ఎకరం ఎంత ధర పెట్టారో తెలుసా.. అక్షరాల 107 కోట్ల రూపాయలకు డిసైడ్ చేశారు. మొత్తం 13.59 ఎకరాల భూమిని.. ఎకరా 107 కోట్ల రూపాయల చొప్పున ఒక వెయ్యి 454 కోట్ల రూపాయలను సమీకరించాలని నిర్ణయించింది.

ప్రభుత్వం ఏపీకి పరిపాలన రాజధానికి విశాఖపట్నం కాబోతున్నది. ఇప్పటికే వైజాగ్ అన్ని రంగాల్లోనూ అభివృద్ధి సాధించింది. రవాణా పరంగా రోడ్డు, రైలు, జల, వాయు మార్గాలతో అత్యంత శక్తివంతమైన నగరం ఉంది. స్మార్ట్ సిటీల్లోనూ నెంబర్ టెన్ లో ఉంది. ఈ క్రమంలోనే ప్రభుత్వం వేలం వేయబోతున్న భూముల ధరలు ఆశాకాన్ని తాకాయి.

ఒక్కో ఎకరం ధర 107 కోట్ల రూపాయలుగా నిర్ణయించినా.. అంత కంటే ఎక్కువ రావొచ్చని భావిస్తున్నారు. అంతర్జాతీయ సంస్థలు సైతం వేలంలో పాల్గొనడంతో.. ప్రభుత్వానికి అంతకు మించి ధర రావొచ్చు అంటున్నారు.

గతంలో తెలంగాణ సీఎం కేసీఆర్ అన్న మాటలకు.. ఇప్పుడు ఏపీలో జరుగుతున్న భూముల వేలంలో ధరలకు ఎక్కడైనా పొంతన ఉందా చెప్పండి.. హైదరాబాద్ జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ లో ఎకరం ఎన్ని కోట్లు ఉందో కానీ.. విశాఖపట్నంలో మాత్రం ప్రభుత్వం అఫిషియల్ గా అనౌన్స్ చేసింది.. ఎకరం 107 కోట్లు అని..

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు