ఆస్పత్రుల్లోనే కరోనా వైరస్ ఎక్కువగా ఉంది – సర్వేలో బయటపడిన నిజం

ఆస్పత్రుల్లోనే కరోనా వైరస్ ఎక్కువగా ఉంది - సర్వేలో బయటపడిన నిజం.. ప్రాంతాల్లోని గాలిలో సరాసరి 37.5శాతం కరోనా వైరస్ ఉంటుందని.. చికిత్స కంటే వైరస్ వ్యాప్తి ఆందోళన కలిగిస్తుందని

కరోనా వైరస్ ఎక్కడ ఎక్కువగా ఉంది.. ఎక్కడి నుంచి ఎక్కువగా వ్యాపిస్తుంది అనే వాస్తవం తెలిస్తే అందరూ షాక్ అవుతారు. ఇటీవల రెండు నెలలుగా చేసిన సర్వే.. సేకరించిన శాంపిల్స్ పరిశీలించిన తర్వాత మనుషుల శరీరంలో కంటే.. బయట గాలిలో కంటే.. ఆస్పత్రుల్లోనే కరోనా వైరస్ ఎక్కువగా ఉండటంతోపాటు.. వ్యాప్తికి కారణం అవుతున్నాయి అని తేల్చింది సర్వే సంస్థ.

వివిధ ప్రాంతాలు అంటే ఆస్పత్రులు, రెస్టారెంట్లు, హోటల్స్, రిసార్ట్స్ ఇలా అన్ని ప్రాంతాల నుంచి 471 ఎయిర్ శాంపిల్స్ తీసుకుంటే.. 81 శాంపిల్స్ ఆస్పత్రుల్లోని ఏసీ గదుల్లో వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. 107 క్లోజ్ డ్ ఐసీయూ శాంపిల్స్ లో.. 27 శాంపిల్స్ లో కరోనా వైరస్ స్థాయి ఎక్కువగా ఉంది. అదే నాన్ ఏసీ ఐసీయూ సెంటర్లలోని 364 ఎయిర్ శాంపిల్స్ లో.. 39 సెంటర్లలో మాత్రం కరోనా వైరస్ ఉంది.

ఆస్పత్రుల్లోని టాయ్ లెట్స్ వల్ల 23.8 శాతం కరోనా వ్యాప్తి ఉంటే.. 12 శాతం ఆస్పత్రి స్టాఫ్ ఉంటే గదుల ద్వారా కరోనా వైరస్ వ్యాప్తి జరుగుతుందని నిర్థారించారు. ఆస్పత్రుల్లోని క్లినికల్ ఏరియా ద్వారా 8.3 శాతం వైరస్ ఉంటుంది.

2020, జనవరి ఒకటి నుంచి అక్టోబర్ 27వ తేదీ వరకు చైనా, అమెరికా, హాంకాంగ్, కొరియా, సింగపూర్, ఇరాన్, ఇంగ్లాండ్, ఇటలీ దేశాల్లో 24 సర్వే సంస్థలు.. వేలాది ఆస్పత్రుల్లోని ఎయిర్ శాంపిల్స్ సేకరించటం ద్వారా ఈ నిజం బయటపడింది.

పబ్లిక్ ప్రదేశాలు, జన సమూహం ఉన్న ప్రాంతాల్లోని గాలిలో 33 శాతం కరోనా వైరస్ మాత్రమే ఉందని.. ఆస్పత్రుల ద్వారా వ్యాప్తితో పోల్చుకుంటే.. ఇది సరిసమానం అంటున్నాయి నివేదికలు.

కరోనా వైరస్ బారిన పడి ఐసీయూలో చికిత్స పొందుతున్న ప్రాంతాల్లోని గాలిలో సరాసరి 37.5శాతం కరోనా వైరస్ ఉంటుందని.. చికిత్స కంటే వైరస్ వ్యాప్తి ఆందోళన కలిగిస్తుందని అధ్యయాలు చెబుతున్నాయి.

కరోనా వచ్చి ఆస్పత్రిలో చేరటం కంటే.. ఇంట్లో ఉండి ట్రీట్ మెంట్ తీసుకోవటం ద్వారా మరింత మెరుగైన చికిత్స ఉంటుంది అేది ఈ అధ్యయనంతో స్పష్టం అయ్యింది. ఆస్పత్రులకు వెళ్లి కరోనా అంటించుకోవటం కన్ఫామ్ అంటున్నారు.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు