గోవా టూర్ ప్లాన్ చేస్తున్నారా.. ఈ విషయాలు తెలుసుకోండి.. లేకపోతే వెనక్కి పంపిస్తారు

గోవా టూర్ ప్లాన్ చేస్తున్నారా.. ఈ విషయాలు తెలుసుకోండి.. లేకపోతే వెనక్కి పంపిస్తారు

గోవా టూర్ ప్లాన్ చేస్తున్నారా.. ఈ విషయాలు తెలుసుకోండి.. లేకపోతే వెనక్కి పంపిస్తారు

ఇళ్లల్లో ఉండీ ఉండీ బోర్ కొడుతుంది కుర్రోళ్లకు.. వాళ్లకే కాదండీ ఫ్యామిలీలకు కూడా. అందుకే టూర్ వేద్దామని ప్లాన్ చేస్తున్నారు. కరోనా సెకండ్ వేవ్ తగ్గిపోయిందని ఫీలవుతూ.. లాంగ్ ట్రిప్ కోసం ఆత్రుతగా ఉన్నారు. ప్రస్తుతం వీళ్లందరూ ఎక్కువగా గోవా టూర్ ప్లానింగ్ లో ఉన్నారు. అక్కడ అన్ సీజన్ కావటంతో.. అందుబాటు ధరల్లో.. ఎక్కువ ఎంజాయ్ చేయొచ్చని ప్లాన్ చేస్తున్నారు. అలాంటి వారు ఈ విషయాలు తెలుసుకోండి.. లేకపోతే బుక్ అయిపోయారు.. గోవా వరకు వెళ్లి వెనక్కి రాక తప్పదు..

గోవాలో ప్రస్తుతం ఉన్న ఆంక్షలు :

> రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నా.. కరోనా నెగెటివ్ సర్టిఫికెట్ ఉండాల్సిందే. అది కూడా 72 గంటల ముందు టెస్ట్ చేయించుకోవాలి
> వ్యాక్సిన్ తీసుకున్న వారు కరోనా టెస్ట్ చేయించుకోకుండా వెళితే.. గోవాకు చేరుకోగానే ఆర్టీపీసీఆర్ టెస్ట్ కోసం మిమ్మల్ని ఓ రోజంతా వెయిట్ చేయిస్తారు. ఆ తర్వాతే గోవాలోకి ఎంట్రీ ఇస్తారు.
> వ్యాక్సిన్ తీసుకోని వారు.. కరోనా సర్టిఫికెట్ లేనివారు ఉంటే మాత్రం వెనక్కి తిరిగి రావాల్సిందే.
> ఉదయం ఏడు గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు మాత్రమే గోవా ఓపెన్ అయ్యి ఉంటుంది. రాత్రి పూట కర్ఫ్యూ అమల్లో ఉంది.

> కాసినోలు క్లోజ్ చేశారు.
> స్పాలు, బ్యూటీ పార్లర్లు, మసాజ్ సెంటర్లు మూసివేసి ఉన్నాయి.
> నైట్ క్లబ్స్, పబ్స్ అన్నీ బంద్.
> బార్లు, వైన్ షాపులు ఓపెన్ అయ్యాయి. బార్లలో 50 శాతం సీటింగ్ మాత్రమే అనుమతి. రెస్టారెంట్లలోనూ ఇదే సిట్యువేషన్

> బీచులు ఓపెన్ అయ్యాయి.. సోషల్ డిస్టెన్స్ పాటించాలని నిబంధన ఉంది.
> వాటర్ స్పోర్ట్స్.. సముద్రం లోతుల్లోకి వెళ్లి చూసే టూరిజం బంద్ అయ్యింది.
> విదేశీ పర్యాటకులు తగ్గిపోవటంతో కలరింగ్ లేదు.
> గోవా అంతటా ఎక్కడికక్కడ ఆంక్షలు ఉన్నాయి.
> కుర్రోళ్లకు కొంచెం ఇష్టం – కొంచెం కష్టంగానే ఉంది ప్రస్తుతం గోవాలో సిట్యువేషన్.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు