హైదరాబాద్ కాకుండా.. ఢిల్లీ నుంచి చెక్కేయాలని ప్లాన్ చేసిన సుజనాచౌదరి

విదేశాలకు వెళ్లిపోతూ దొరికిపోయి.. మళ్లీ కోర్టులో కేసు వేయటంపై పలు సందేహాలు, అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

దేశవ్యాప్తంగా వివిధ బ్యాంకులను 8 వేల కోట్ల రూపాయలకు మోసం చేసిన కేసులో 2018లోనే మూడు ఎఫ్ఐఆర్ లు నమోదు చేసింది సీబీఐ, ఈడీ, ఎన్ ఫోర్స్ మెంట్ డిపార్ట్ మెంట్లు. పదుల సంఖ్యలో నోటీసులు ఇచ్చినా ఇప్పటి వరకు ఎలాంటి స్పందన లేకపోవటంతో.. సుజనాచౌదరికి చెందిన ఫెరారీ, బెంజ్ కార్లను స్వాధీనం చేసుకుంది ఈడీ. ఇతర ఆస్తులను వేలం వేయటానికి సిద్ధం అయ్యింది. మొత్తం విలువను లెక్కించినా 132 కోట్ల రూపాయలు రావటం లేదని.. అప్పు మాత్రం 8 వేల కోట్లు వరకు ఉందని తేల్చింది ఈడీ, ఎన్ ఫోర్స్ మెంట్. ఈ క్రమంలోనే సుజనాచౌదరిని అరెస్ట్ చేసి.. విచారణ చేయటం ద్వారా.. అతని బినామీ ఆస్తులను కూడా స్వాధీనం చేసుకోవటం, వేలం వేయాలని నిర్ణయించింది.

దేశవ్యాప్తంగా దర్యాప్తు సంస్థలు విచారణను వేగవంతం చేసిన క్రమంలోనే.. అరెస్ట్ కావటం ఖాయం అని భావించిన ఆయన.. దేశం నుంచి పారిపోవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. లుక్ ఔట్ నోటీసులు ఉన్నా.. ఎయిర్ పోర్టులో అడ్డుకుంటారని తెలిసినా తెలివిగా వ్యవహరించారు. హైదరాబాద్ ఇమ్మిగ్రేషన్ అధికారులు అయినా ఈజీగా గుర్తుపడతారని భావించినా ఆయన.. ఢిల్లీ వెళ్లి అక్కడి నుంచి అమెరికా వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీ ఎయిర్ పోర్టులో ఇమ్మిగ్రేషన్ అధికారులు.. సుజనా చౌదరి హిస్టరీ చూసిన వెంటనే అప్రమత్తం అయ్యారు. అదుపులోకి తీసుకున్నారు. విషయాన్ని ఈడీ, ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులకు సమాచారం ఇచ్చారు.

విదేశాలకు పారిపోవాలని ప్లాన్ చేసిన సుజనాచౌదరి అడ్డంగా దొరికిపోయిన తర్వాత కొత్త నాటకానికి తెరతీశారు. అమెరికా వెళ్లేందుకు అడ్డుకున్నారని.. లుక్ ఔట్ నోటీసులు రద్దు చేయాలని తెలంగాణ హైకోర్టులో పిటీషన్ వేశారు. బ్యాంకుల నుంచి 8 వేల కోట్ల రూపాయల అప్పు తీసుకుని ఎగ్గొట్టి.. విదేశాలకు వెళ్లిపోతూ దొరికిపోయి.. మళ్లీ కోర్టులో కేసు వేయటంపై పలు సందేహాలు, అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు