ఫార్మా, రియల్ ఎస్టేట్ కంపెనీల్లో రూ.3 వేల కోట్ల బ్లాక్ మనీ పట్టివేత

ఫార్మా, రియల్ ఎస్టేట్ కంపెనీల్లో రూ.3వేల కోట్ల బ్లాక్ మనీ పట్టివేత

తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ కేంద్రంలో వ్యాపార లావాదేవీలు నిర్వహిస్తున్న కంపెనీల్లో వేల కోట్ల రూపాయల బ్లాక్ మనీ వెలుగులోకి వచ్చింది. 10 రోజులుగా అత్యంత రహస్యంగా తనిఖీలు చేస్తున్న ఇన్ కం ట్యాక్స్ అధికారులు.. బ్లాక్ మనీ లావాదేవీలు చూసి షాక్ అయ్యారు.

హైదరాబాద్ కు చెందిన ఓ ఫార్మా కంపెనీలు ఐదు రోజులు తనిఖీ చేయగా.. 2 వేల కోట్ల రూపాయల బ్లాక్ మనీ గుర్తించినట్లు సమాచారం. గత ఏడేళ్లలోనే లెక్కల్లోకి రాని ఈ లావాదేవీలు చేసినట్లు గుర్తించారు. ట్యాక్స్ పరిధిలో చూపించిన ఈ 2 వేల కోట్ల రూపాయలపై ఆదాయపన్ను అధికారులు తీవ్రంగా పరిగణిస్తున్నారు. ఇప్పటికప్పుడు ఈ 2 వేల కోట్లకు ట్యాక్స్ వసూలు చేసినా.. ప్రభుత్వానికి 650 కోట్ల రూపాయలు రానుంది. ఇంత పెద్ద మొత్తంలో పన్ను ఎగ్గొడుతున్న కంపెనీపై కేసులు నమోదు చేయటానికి రంగం సిద్ధం చేస్తున్నారు.

ఫార్మా కంపెనీనే కాకుండా.. రెండు రియల్ ఎస్టేట్ కంపెనీల్లోనూ సోదాలు చేసిన ఇన్ కం ట్యాక్స్ అధికారులు.. 12 వందల కోట్ల రూపాయల అక్రమ లావాదేవీలు చేసినట్లు గుర్తించారు. ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీలు చలామణి అవుతూ.. ఇన్ కం ట్యాక్స్ ఎగ్గొడుతున్నారని.. తప్పుడు రికార్డులు నిర్వహిస్తూ.. బ్లాక్ మనీని పోగేసినట్లు గుర్తించారు అధికారులు.

ఫార్మా కంపెనీతోపాటు రెండు రియల్ ఎస్టేట్ కంపెనీల్లోనే 3 వేల 200 కోట్ల రూపాయల బ్లాక్ మనీ గుర్తించిన ఇన్ కం ట్యాక్స్ అధికారులు షాక్ అయ్యారు. హైదరాబాద్ కేంద్రంగా జీఎస్టీ, ఇన్ కం ట్యాక్స్ భారీ ఎత్తున ఎగ్గొడుతున్నారని వచ్చిన సమాచారం ఆధారంగా తనిఖీలు చేయగా.. ఈ గుట్టు రట్టు అయ్యింది. ఇప్పటికిప్పుడు ఈ 3 వేల 200 కోట్ల రూపాయలకు పన్ను వేసినా.. ప్రభుత్వానికి 12 వందల కోట్ల రూపాయలు రానున్నాయి.

3 వేల 200 కోట్ల రూపాయల బ్లాక్ మనీ సంపాదించిన వీరికి రాజకీయ పలుకుబడి ఉండగా ఏంటీ.. మేనేజ్ చేయరా ఏంటీ అనే టాక్ బలంగా వినిపిస్తుంది. ఈ కంపెనీలు ఏంటీ.. ఎవరు బ్లాక్ మనీ పోగేశారు అనేది బయటకు రావాల్సి ఉంది..

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు