2009 రిపీట్ – జీహెచ్ఎంసీలో హంగ్ – టీఆర్ఎస్ – ఎంఐఎం పొత్తు ఖాయం

2009 రిపీట్ - జీహెచ్ఎంసీలో హంగ్ - టీఆర్ఎస్ - ఎంఐఎం పొత్తు ఖాయం.. మొత్తం 88 మంది అయ్యారు. మేయర్ పీఠం దక్కించుకోవాలి అంటే ఇంకా 10 మంది మద్దతు కావాలి. అంటే మరో పార్టీ మద్దతు ఇవ్వాల్సిందే..

Hung in ghmc 2020 elections, mim support to TRS
Hung in ghmc 2020 elections, mim support to TRS

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏ పార్టీకి పూర్తి మెజార్టీ ఇవ్వలేదు ఓటర్లు. మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక కోసం అవసరం అయిన సీట్లను ఏ పార్టీ కూడా సొంతంగా గెలుచుకోలేదు. శుక్రవారం రాత్రి 7 గంటల వరకు ఫలితాలను చూస్తే.. టీఆర్ఎస్ 57 స్థానాలు, బీజేపీ 48 స్థానాలు, ఎంఐఎం 42 స్థానాల్లో గెలిచింది.

జీహెచ్ఎంసీలో మొత్తం డివిజన్లు 150. మ్యాజిక్ ఫిగర్ 76 సీట్లు. ఎక్స్ అఫిషియో సభ్యులు ఉంటారు. వీళ్లు మొత్తం 46 మంది ఉంటారు. 150 ప్లస్ 46 కలుపుకుంటే 196 మంది ఉండాలి. అప్పుడు మ్యాజిక్ ఫిగర్ 98. ఏ పార్టీకి అయినా సొంతంగా 98 మంది ఉంటే మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక లాంఛనం అవుతుంది.

టీఆర్ఎస్ పార్టీ గ్రేటర్ లో 57 స్థానాల్లో గెలిచింది. ఎక్స్ అఫిషియో సభ్యులు 31 మంది ఉన్నారు. మొత్తం 88 మంది అయ్యారు. మేయర్ పీఠం దక్కించుకోవాలి అంటే ఇంకా 10 మంది మద్దతు కావాలి. అంటే మరో పార్టీ మద్దతు ఇవ్వాల్సిందే.

ఎంఐఎం 42 సీట్లలో గెలిచింది. బీజేపీ 48 స్థానాల్లో గెలిచి రెండో పెద్ద పార్టీగా అవతరించింది.

బీజేపీకి ఎంఐఎం పార్టీ మద్దతు ఇవ్వదు కాబట్టి.. టీఆర్ఎస్ పార్టీకి అవసరం అయిన మద్దతును ఎంఐఎం ఇస్తుంది.

2009లో ఇలాగే జరిగింది. అప్పుడు కాంగ్రెస్ – ఎంఐఎం చెరో రెండున్నరేళ్లు మేయర్ పీఠం పంచుకున్నాయి. సేమ్ టూ సేమ్ ఇప్పుడు కూడా అలాగే జరిగింది.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు