కోటిన్నరకు మొగుడిని అమ్మేసిన భార్య.. వేలంలో దక్కించుకున్న ప్రియురాలు

కోటిన్నరకు మొగుడిని అమ్మేసిన భార్య.. వేలంలో దక్కించుకున్న ప్రియురాలు

wife sells her husband
wife sells her husband

శుభలగ్నం సినిమా గుర్తుందా.. జగపతిబాబు హీరో.. ఆమని, రోజా హీరోయిన్స్. బాగా బతకాలనే ఆశతో.. ఆమని తన భర్త అయిన జగపతిబాబును.. కోటి రూపాయలకు రోజాకు అమ్మేస్తుంది. ఆ డబ్బుతో ఇళ్లు, బంగ్లాలు కొనుక్కుంటుంది. సరిగ్గా శుభలగ్నం సినిమా టైపులోనే.. మధ్యప్రదేశ్ లో ఓ ఘటన జరిగింది.

భోపాల్ లో నివాసం ఉండే భార్త,భర్తల మధ్య ఇటీవల గొడవలు జరుగుతున్నాయి. ఇంటిని పట్టించుకోవటం లేదని రాద్దాంతం. అసలు విషయం ఏంటా అంటే ఆఫీసులో పని చేసే సదురు భర్తకు.. అక్కడ ఓ ప్రియురాలు ఉంది. విషయం బయటపడటంతో.. పెద్ద కుమార్తె కంప్లయింట్ తో ఫ్యామిలీ కోర్టులో కేసు ఫైల్ అయ్యింది. ప్రియురాలు ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు. అదే సయయంలో సదరు భర్తగారు కూడా భార్యపై కంటే ప్రియురాలిపైనే ఎక్కువ మొగ్గు చూపాడు.

సరిగ్గా ఇదే సమయంలో ప్రియురాలు ఓ ఆఫర్ ఇచ్చింది భార్యకు. నీ మొగుడిని వదిలేస్తే మీ ఇద్దరు ఆడ పిల్లల జీవితాలను సెటిల్ చేస్తాను అని. ఈ ఆఫర్ బాగుందని భావించిన భార్య.. ఎంత ఇస్తావో చెప్పమంది. కోటి రూపాయలు అని చెప్పింది. పిల్లల పెళ్లిళ్లు చేయాలని సరిపోదు అని డిమాండ్ పెట్టింది. అదీ ఇదీ కాదు.. ఫైనల్ గా ఓ ఆఫర్ ఇస్తానంటూ ముందుకు వచ్చింది ప్రియురాలు.

తనకు ఉన్న కోటి 25 లక్షల రూపాయల విలువైన విల్లాను ప్రియుడు భార్యకు రాసిచ్చేసింది. అంతే కాకుండా ఇద్దరు ఆడ పిల్లల చదువు, పెళ్లి కోసం మరో 27 లక్షల రూపాయల నగదు ఇచ్చింది. మొత్తం కోటిన్నర రూపాయలు ఇచ్చి.. ప్రియుడిని సొంతం చేసుకుంది ప్రియురాలు.

భర్త ఎటూ ప్రేమగా చూడటం లేదు.. ఇంటిని పట్టించుకోవటం లేదు.. అలాంటప్పుడు మొగుడు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే అని భావించి భార్య తీసుకున్న నిర్ణయం సరైనదా కాదా అనేది పక్కన పెడితే.. సమయానుకూలంగా వ్యవహరించినందుకు హ్యాట్సాప్ అంటున్నారు నెటిజన్లు.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు