వ్యభిచారం గుట్టురట్టు.. నలుగురు అరెస్ట్

సులువుగా డబ్బు సంపాదించడం కోసం కొందరు వ్యక్తులు అడ్డదారులు తొక్కుతున్నారు. గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచార గృహాలు నిర్వహిస్తున్నారు. నగరంలో వ్యభిచార గృహాలు నిర్వహిస్తున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది. తాజాగా జూబ్లీహిల్స్ ప్రాంతంలో ఓ వ్యభిచార గృహంపై దాడి చేశారు పోలీసులు. ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. నిర్వాహకులపై కేసు నమోదు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఇక బుధవారం బంజారాహిల్స్ ప్రాంతంలో మరో వ్యభిచార గృహాన్ని పోలీసులు గుర్తించారు. బంజారాహిల్స్‌ రోడ్‌ నెం.12లోని ఆనంద్‌ బంజారా కాలనీలో ఓ ఇంటిని అద్దెకు తీసుకోని వ్యభిచారం నిర్వహిస్తున్నారు.

గుట్టుచప్పుడు కాకుండా జరుగుతున్న వ్యభిచారాన్ని కొందరు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు వ్యభిచార గృహంపై దాడి చేశారు. ఉత్తర ప్రదేశ్ కు చెందిన మనోజ్ ప్రకాష్ బాసి (40), రమేష్ పటేల్ (24)ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరితోపాటు ప్రశాంత్‌గౌడ(28), గురు(30), లోకేష్‌గౌడ(32), అభిషేక్‌(27) లను పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఇద్దరు సెక్స్ వర్కర్లను పునరావాస కేంద్రానికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

వ్యభిచారం గుట్టురట్టు.. నలుగురు అరెస్ట్

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు