మీ సేవ కేంద్రాలకు వరద బాధితులు – తెల్లవారుజాము నుంచే క్యూ

ఎన్నికల ప్రక్రియ మొత్తం ముగిసింది. మూడు రోజులుగా ప్రభుత్వం వరద సాయంపై ఎలాంటి ప్రకటన చేయలేదు.. ఏ మీడియా ప్రస్తావించలేదు.. అయినా బాధితులు మర్చిపోలేదు.. సీఎం కేసీఆర్ చెప్పారు అంటే

జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా నిలిచిపోయిన వరద సాయాన్ని డిసెంబర్ 7వ తేదీ నుంచి తిరిగి ఇస్తాం అని.. బాధితులు అందరికీ 10 వేల సాయం అందిస్తాం అని సీఎం కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. జీహెచ్ఎంసీ ఎన్నికలు ముగిశాయి కదా.. ఇప్పుడు బాధితులు అందరూ మళ్లీ రోడ్డెక్కారు. మీ సేవ కేంద్రాల దగ్గర బారులు తీరారు.

డిసెంబర్ 7వ తేదీ సోమవారం తెల్లవారుజాము నుంచే కూకట్ పల్లి, కేపీహెచ్ బీ మీ సేవ కేంద్రాల దగ్గర వందలాది మంది బారులు తీరారు. ఆధార్ కార్డు, రేషన్ కార్డు కాపీలు పట్టుకుని.. దరఖాస్తులతో మీ సేవ కేంద్రం ఎప్పుడు తెరుస్తారా అని వెయిట్ చేస్తున్నారు.

పోలింగ్ ముగిసింది.. ఓట్ల లెక్కింపు పూర్తయ్యి.. ఎన్నికల ప్రక్రియ మొత్తం ముగిసింది. మూడు రోజులుగా ప్రభుత్వం వరద సాయంపై ఎలాంటి ప్రకటన చేయలేదు.. ఏ మీడియా ప్రస్తావించలేదు.. అయినా బాధితులు మర్చిపోలేదు.. సీఎం కేసీఆర్ చెప్పారు అంటే చేస్తారు అని భరోసాతో డిసెంబర్ 7వ తేదీ తెల్లవారుజాము నుంచే మీ సేవ కేంద్రాలకు తరలివచ్చారు.

ఇప్పుడు ఎన్నికల కోడ్ కూడా లేదు.. ప్రభుత్వానికి ఎలాంటి ఇబ్బంది లేదు.. దరఖాస్తు తీసుకుని డబ్బులు వేయటమే మిగిలింది. సిటీ మొత్తం ఇదే పరిస్థితి నెలకొంది. చలిని సైతం లెక్కచేయకుండా మీ సేవ కేంద్రాలకు తరలివస్తున్నారు వరద బాధితులు. 10 వేల రూపాయలు ఎప్పుడు అకౌంట్ లో పడతాయా అని ఆశతో ఎదురుచూస్తున్నారు..

విషయం తెలుసుకున్న పోలీసులు.. మీ సేవ కేంద్రాల దగ్గర వచ్చి బాధితులను ఇంటికి పంపించి వేస్తున్నారు. వరద సాయాన్ని ఇంటింటికీ వచ్చి ఇస్తారని.. మీ సేవ కేంద్రాల దగ్గరకు రావొద్దని చెబుతున్నారు.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు