కరోనా డేంజర్ లో హైదరాబాద్ – మూడో ప్రమాద హెచ్చరిక జారీ.. దీని అర్థం ఏంటో తెలుసా..

కరోనా డేంజర్ లో హైదరాబాద్ - మూడో ప్రమాద హెచ్చరిక జారీ.. దీని అర్థం ఏంటో తెలుసా..

తెలంగాణ రాష్ట్రంలో కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తోంది. ఏప్రిల్ 7వ తేదీ 2 వేల కొత్త కేసులు నమోదు అయితే.. యాక్టివ్ కేసుల సంఖ్య.. అంటే కరోనా బారిన పడి.. చికిత్స తీసుకుంటున్న వారి సంఖ్య 10 వేలకుపైగా ఉంది.

ఈ క్రమంలోనే కరోనా పరిస్థితులపై సమీక్ష నిర్వహించిన తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ.. కరోనా మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేసింది. ఈ హెచ్చరిక ఏంటీ అంటే.. అవసరం అయితేనే ఇంట్లో నుంచి బయటకు రావాలి. అనవసరంగా బయట తిరగొద్దు.. ఎవర్నీ కలవద్దు.. మాస్క్ పెట్టుకోకపోతే కరోనా ఎటాక్ అయ్యే అవకాశం ఉంది.. దీనికితోడు కరోనా వైరస్ ఉండి కూడా లక్షణాలు బయటకు కనిపించటం లేదని.. ఈసారి ఇది చాలా ప్రమాదకర స్థాయిలో విస్తరిస్తుందని తెలంగాణ వైద్య శాఖ స్పష్టం చేసింది.

రాబోయే నెల రోజులు అంటే.. నాలుగు వారాలు చాలా చాలా కీలకం అని.. కేసుల సంఖ్య విపరీతంగా పెరిగే సూచనలు ఉన్నాయని స్పష్టం చేసింది. సినిమాలు, షికార్లు తగ్గించుకోవాలని హెచ్చరించింది. మిత్రులతో సమావేశం అయ్యే సమయంలోనూ మాస్క్, సామాజిక దూరం తప్పనిసరి అని వెల్లడించారు వైద్య శాఖ అధికారులు.

హైదరాబాద్ లో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయని.. అందరూ అప్రమత్తంగా ఉండాలని సూచిస్తూనే.. ఈసారి లాక్ డౌన్, కర్ఫ్యూలు ఉండవని.. ఎవరికి వారు రక్షణ తీసుకోవాలని స్పష్టం చేసింది ప్రభుత్వం. ఇదే ఇప్పుడు కరోనా కేసులు పెరగటానికి కారణం అవుతున్నాయి. అయినా కూడా ప్రభుత్వం ఎలాంటి నిర్బంధాలు విధించటం లేదని ప్రజలే అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేసింది.

ఆఫీసుల్లో.. ట్రావెల్ లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలను హెచ్చరించింది. కూరగాయలు షాపులు, కిరాణా దుకాణాల దగ్గర మాస్క్ తోపాటు బౌతిక దూరం పాటించాలని ఆదేశించింది. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానా విధిస్తామని హెచ్చరించింది ప్రభుత్వం.

కరోనా మూడో ప్రమాద హెచ్చరిక జారీ అంటే మామూలు విషయం కాదు.. చాలా డేంజర్ లో ఉన్నామన్న సంగతి ప్రజలు గుర్తించుకోవాలి.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు