అమెరికాలో హైదరాబాద్ వాసి మృతి

అమెరికాలో హైదరాబాద్ వాసి మృతి

అమెరికాలో హైదరాబాద్ కు చెందిన 37 ఏళ్ల మహ్మద్ ఆరిఫ్ మోహియుద్ధీన్ హత్యకు గురయ్యారు. అమెరికాలోని జార్జియా పట్టణంలో ఈ ఘటన జరిగింది. పాతబస్తీ, చంచల్‌గూడకు చెందిన మహ్మద్ ఆరిఫ్ పదేళ్లక్రితం అమెరికా వెళ్లారు అక్కడే ఓ కిరణం నడుపుతున్నాడు. ఇక ఈ క్రమంలోనే ఆదివారం ఇంటివద్ద ఉన్న అతడిపై గుర్తుతెలియని దుండగులు దాడి చేశారు. కత్తితో విచక్షణ రహితంగా పొడిచారు. చావుబ్రతుకుల మధ్య ఉన్న మహ్మద్ ఆరిఫ్ మోహియుద్ధీన్ ను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు. ఇక ఈ హత్యకు సంబందించిన దృశ్యాలు సీసీటీవీలో నమోదయ్యాయి.

కుటుంబ సభ్యులకు ఫోన్ ద్వారా విషయం తెలిపారు జార్జియా పోలీసులు, ఆరిఫ్ మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. తన భర్త దహనసంస్కారాలు జరిపేందుకు తనతో పాటు తన తండ్రిని అమెరికా పంపాలని ఆరిఫ్ భార్య ప్రభుత్వాన్ని కోరింది. తమకు అనుమతి ఇవ్వాలని వేడుకుంది. అమెరికాలో తమకు బంధువులు ఎవరు లేరని భర్త అంత్యక్రియలు నిర్వహించేందుకు తామే వెళ్లాలని, తమకు ప్రభుత్వం సాయం చెయ్యాలని వేడుకున్నారు. మజ్లిస్ బచావో తెహ్రీక్ పార్టీ ప్రతినిధి ఉల్లా ఖాన్ విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్‌తోపాటు అమెరికాలోని భారత రాయబార కార్యాలయానికి ఫాతిమాను యూఎస్‌ పంపించాలని కోరుతూ కుటుంబం తరపున లేఖ రాశారు.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు