సామాజిక, మానవత్వం కోణంలో ఆలోచిస్తున్న సైబరాబాద్ పోలీస్.. కరోనా కుటుంబాలకు అండగా సీపీ సజ్జనార్

hyderabad cp sajjanar

కరోనా అంటే భయం.. భయంతోనే చాలా మంది చావు దగ్గరకు వెళుతున్నారు. దీనికి కారణం కరోనా బాధిత కుటుంబాలను కుటుంబ సభ్యులు, బంధువులు దూరంగా పెట్టటమే. దీంతో ఆయా కుటుంబాల్లోని పిల్లలు రక్షణ.. ఆ తల్లిదండ్రులకు భారంగా మారుతుంది. ఎవరూ చేరదీయకపోవటంతో అనాధలుగా మారుతున్నారు. కనీసం చుట్టుపక్కల వాళ్లు, కుటుంబ సభ్యులు, బంధువులు, చుట్టాలు సైతం దూరంగా పెట్టటంతో.. కరోనా బాధిత కుటుంబ సభ్యులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. ఏదైనా అయితే మా పిల్లలు అనాధలు అవుతారనే బాధ ఆ తల్లిదండ్రులకు మరింత కుంగదీస్తుంది. దీన్ని గుర్తించిన సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్.. సామాజిక, మానవత్వం కోణంలో ఆలోచించి తీసుకున్న నిర్ణయం అద్భుతం అంటున్నారు.

ఇంట్లో తల్లిదండ్రులకు కరోనా వస్తే.. వారి పిల్లల సంరక్షణ బాధ్యత కోసం హెల్ప్ లైన్ నెంబర్ ఏర్పాటు చేశారు సైబరాబాద్ పోలీసులు. సైబరాబాద్ చైల్డ్ కేర్ రెస్పాన్స్ హెల్ప్ లైన్ నెంబర్ 080-45811215ను ఏర్పాటు చేశారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈ కాల్ సెంటర్ పని చేస్తుంది.

భార్యాభర్తల్లో ఒకరికి కరోనా సోకితే.. మరొకరు ఐసోలేషన్ కావాల్సి ఉంటుంది. ఈ సమయంలో పిల్లల బాధ్యత కష్టంగా మారుతుంది. వారి బంధువులు, చుట్టాలు ఇతర ప్రాంతాల్లో ఉండటం ఓ కారణం అయితే.. కరోనా భయంతో స్నేహితులు, ఇతరులు ముందుకు రాకపోవటం మరో కారణంగా కనిపిస్తుంది.

ఇలాంటి సమయంలో సైబరాబాద్ పోలీసులు ఏర్పాటు చేసిన చైల్డ్ కేర్ హెల్ప్ లైన్ నెంబర్ కు కాల్ చేసి తమ బాధను వ్యక్తం చేస్తున్నారు. స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఈ కేర్ టేకర్ సెంటర్ వర్క్ చేసింది. బాధితుల కాల్ వచ్చిన తర్వాత అన్ని వివరాలు నమోదు చేసుకుని.. ప్రత్యేక బృందం వారి ఇంటికి వచ్చి.. పిల్లల సంరక్షణ బాధ్యత తీసుకుంటుంది. కోవిడ్ బాధితుల పిల్లలను కేర్ సెంటర్ కు తీసుకెళ్లి వారికి కావాల్సినవి అన్నీ సమకూర్చుతున్నారు.

సైబరాబాద్ పోలీసులు ఏర్పాటు చేసిన ఈ సెంటర్ నుంచి ఇప్పటికే 35 మంది పిల్లల ఆలనాపాలనా చూసుకుంటుంది. పదేళ్లలోపు చిన్నారుల సంరక్షణకు మొదటి ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు పోలీసులు. కరోనా వచ్చిన వెంటనే సమస్యను అడిగి తెలుసుకోవటంతోపాటు.. పిల్లల బాధ్యత విషయంలో ఆ కుటుంబం ఆందోళన పడకుండా.. దైర్యం చికిత్స తీసుకునే విధంగా మనోదైర్యం ఇస్తున్నట్లు తెలిపారు పోలీసులు.

హైదరాబాద్ సిటీలో దాదాపు అందరూ ఉద్యోగ, ఉపాధి, వ్యాపారం కోసం వచ్చి జీవిస్తున్నవారే.. వారి తల్లిదండ్రులు ఊర్లలోనే ఉంటారు.. కరోనా లాంటి సంక్షోభ సమయంలో సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ ఆధ్వర్యంలో నడుస్తున్న చైల్డ్ కేర్ హెల్ప్ లైన్ ఎన్నో కుటుంబాలకు దైర్యాన్ని ఇస్తుంది.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు