హైదరాబాద్ రియల్ ఎస్టేట్ కు ఏం దరిద్రం పట్టిందబ్బా : ఆ ఛానల్ ఏమని మొదలుపెట్టిందో కానీ..

హైదరాబాద్ రియల్ ఎస్టేట్ కు ఏం దరిద్రం పట్టిందబ్బా.. ఆ ఛానల్ ఏమని మొదలుపెట్టిందో కానీ..

హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం ఒక్కసారి కుదేలు అయ్యింది. కరోనా సెకండ్ వేవ్ అనేది అటు ఉంచితే.. ఆ టీవీ9 ఛానల్ ఏమని మొదలుపెట్టిందో ఏమో కానీ.. అప్పటి నుంచి వరస దెబ్బలు తగులుతున్నాయి.. అడ్వాన్స్ పేమెంట్ లేకుండా.. అనుమతులు లేకుండా వ్యాపారం చేస్తున్నారంటూ వరస కథనాలు ప్రసారం చేసింది. అప్పుడుప్పుడే కోలుకుంటున్న రియల్ ఎస్టేట్ రంగంపై అనుమానాలు చాలా మంది అడ్వాన్సులు వెనక్కి ఇవ్వవాలని డిమాండ్ చేయటంతోపాటు.. కొత్తగా ప్రారంభించాలనుకున్న ప్రాజెక్టులు అన్నీ మూలనపడ్డాయి. అప్పుడప్పుడే కోలుకుంటున్న రియల్ ఎస్టేట్ రంగంపై టీవీ9 కథనాలు తీవ్ర ప్రభావం చూపాయి. చిన్నా, చితక రియల్ ఎస్టేట్ వ్యాపారులు దారుణంగా దెబ్బతిన్నారు.

ఇక ఇప్పుడు కరోనా సెకండ్ వేవ్.. హైదరాబాద్ సిటీలో మధ్యతరగతి ప్రజలు చాలా మంది కరోనా బారిన పడ్డారు. కొంత మంది కుటుంబ యజమానులను కోల్పోయారు. తెలియని విధంగా ఎఫెక్ట్ అయ్యాయి చాలా కుటుంబాలు. ఐటీ ఆఫీసులు మళ్లీ తెరుచుకుంటాయి.. కొనుగోళ్లు ఊపందుకుంటున్నాయి అని భావించే లోపు సెకండ్ వేవ్ తీవ్రంగా విరుచుకుపడింది. లాక్ డౌన్ ప్రకటనతో మళ్లీ జనం ఊర్ల బాట పట్టారు. కరోనా తీవ్రత ఇప్పట్లో తగ్గేలా లేకపోగా.. మళ్లీ థర్డ్ వేవ్ అనే వార్తలు వస్తున్నాయి. ఈ ఏడాది వరకు ఐటీ ఉద్యోగులు బయటకు వచ్చే పరిస్థితులు కనిపించటం లేదు. ముఖ్యంగా ఏపీలో వర్క్ ఫ్రం హోం చేస్తున్న ఐటీ ఉద్యోగులు తిరిగి పూర్తిగా హైదరాబాద్ ఆఫీసులకు వస్తేనే ఏదైనా పుంజుకుంటుందనే ఉద్దేశంలో ఉన్నారు.

ఏడాది కాలంలో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ వ్యాపారం తీవ్ర ఒడుదుడుగులు ఎదుర్కొంటుంది. ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది అన్న టైంలో.. ఆ టీవీ9 ఛానల్ ప్రచారం చేసిన కథనాలతో మధ్య తరగతి ప్రజలతోపాటు.. చాలా మంది వెయిట్ అండ్ సీ అన్నట్లు ఆగిపోయారు. ఈలోపు కరోనా ముంచేసింది అంటున్నారు రియల్ ఎస్టేట్ వ్యాపారులు.

ప్రస్తుతం పరిస్థితులు చూస్తుంటే.. హైదరాబాద్ రియాల్టీ రంగం కోలుకోవటానికి మరో ఏడాది అయినా పట్టే అవకాశం ఉంది అంటున్నారు. లాక్ డౌన్ కారణంగా నడుస్తున్న ప్రాజెక్టులకు కూలీల కొరత వల్ల బ్రేక్ పడుతుంది. ఇక కొత్తగా ప్రారంభించేవి వాయిదా పడ్డాయి.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు