హైదరాబాద్ కుర్రోళ్ల ఓటు బీజేపీకే ఎక్కువ

హైదరాబాద్ కుర్రోళ్ల ఓటు బీజేపీకే ఎక్కువ.. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో యువత ఎక్కువగా బీజేపీ వైపు మొగ్గటం.. అందులోనూ తెలంగాణ కుర్రోళ్లు ఎక్కువగా బీజేపీని విశ్వసించటం అనేది గమనించాల్సిన అంశం..

జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాల్లో ఆసక్తికరమైన విషయం ఒకటి బయటకు వచ్చింది. టీఆర్ఎస్ పార్టీ కంటే తక్కువ సీట్లు గెలిచిన బీజేపీ.. ఓట్ల శాతంలో మాత్రం టాప్ ప్లేస్ లో నిలిచింది. టీఆర్ఎస్ పార్టీకి 30.79 ఓట్లు వస్తే.. బీజేపీ 31.43 శాతం ఓట్లు సాధించింది. దాదాపు ఒక శాతం ఓట్లు అధికంగా రాబట్టుకుని గ్రేటర్ ప్రజల మనస్సుల్లో స్థానం సంపాదించింది. ఇక్కడ ఇంట్రస్టింగ్ పాయింట్ ఏంటీ అంటే..

బీజేపీ ఓటు షేర్ పెరగటానికి ముఖ్య కారణం యువత. కుర్రోళ్లు చాలా మంది బీజేపీ వైపు వెళ్లారు. కొత్తగా ఓటు వచ్చినవారితోపాటు.. ఇంత కాలం తెలంగాణకు కరుడుగట్టిన వాదులు ఉన్న యువత అంతా కూడా బీజేపీకి ఓటు వేసింది.

మొత్తం 31.43 శాతం బీజేపీ ఓట్లలో 11 శాతం యువత ఓట్లు ఉన్నట్లు లెక్కలు చెబుతున్నాయి. బీజేపీకి కొత్తగా ఓటు వేసిన కుర్రోళ్ల వయస్సు అంతా 18 నుంచి 24 ఏళ్ల వారు కావటమే విశేషం. అంటే కొత్తగా ఓటు హక్కు వచ్చినవారితోపాటు.. రెండోసారి జీహెచ్ఎంసీలో ఓటు వేసిన యువత ప్రయార్టీ బీజేపీ కావటం అనేది ఆశ్చర్యకరమైన విషయం.

బీజేపీ అనగానే మధ్య తరగతి ప్రజలు, హిందూవులు, బ్రాహ్మణులు, వైశ్యులు ఇలా వర్గం, వర్ణం ఆధారంగా విభజించి చూపించే పరిస్థితి ఉండేది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో యువత ఎక్కువగా బీజేపీ వైపు మొగ్గటం.. అందులోనూ తెలంగాణ కుర్రోళ్లు ఎక్కువగా బీజేపీని విశ్వసించటం అనేది గమనించాల్సిన అంశం.

యువత ఎక్కువగా బీజేపీ వైపు ఎందుకు వెళ్లింది కారణాలు ఏంటీ.. ఎందుకు వాళ్లు టీఆర్ఎస్ పార్టీని వ్యతిరేకించారు అనటానికి చాలా కారణాలు ఉన్నాయి.. చాలా సున్నితమైన అంశాలు ఉన్నాయి. బైక్ చలాన్లు, డ్రంక్ డ్రైవ్ అంశాలు, పోలీసుల తీరుపై బీజేపీ ఇచ్చిన హామీలు, ప్రస్తావించిన అంశాలు బాగా కనెక్ట్ అయ్యాయి అనేది ఓ పాయింట్. లేకపోతే గచ్చిబౌలి, జూబ్లీహిల్స్, మూసాపేట, అమీర్ పేటలో బీజేపీ ఎలా గెలిచింది అంటారు.. హైదరాబాద్ కుర్రోళ్లు ఏం కావాలి అనుకుంటున్నారో బీజేపీ బాగా గెస్ చేసింది.. బండికి భరోసా ఇచ్చింది కూడా కుర్రోళ్లే అనేది కాదనలేని వాస్తవం, సత్యం.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు