రిటైర్‌మెంట్ ప్రకటించిన పీవీ సింధు

రిటైర్‌మెంట్ ప్రకటించిన పీవీ సింధు

భారత దిగ్గజ బ్యాట్మింటన్‌ క్రీడాకారిణి పూసర్ల వెంటక సింధు‌ ఆటకు రిటైర్‌మెంట్‌ ప్రకటించారు. ఈ మేరకు సోమవారం ఓ సందేశం షేర్ చేశారు. కరోనా కారణంగా తాను రిటైర్‌మెంట్ నిర్ణయం తీసుకున్నని తెలిపారు. డెన్మార్క్‌ ఓపెన్‌ నా చివరి ఆట’ అని ఆమె పేర్కొన్నారు. దీనికి ఓ పెద్ద సందేశం జతచేశారు సింధు కరోనా మహమ్మారి నాకు కనువిప్పుగా మారింది. నా ప్రత్యర్థితో పోరాడటానికి కఠోరమైన శిక్షణ తీసుకునేదాన్ని. చివరి వరకు పోరాడేదాన్ని.

ఇంతకు ముందు చేశాను, ఇకపై కూడా చేయగలను. కానీ కంటికి కనిపించని వైరస్ ను ఎలా ఓడించగలను అని అన్నారు. నెలలు గడుస్తున్నా బయటకు వెళ్లలేకపోతున్నాం. వెళ్లాలనుకునే ప్రతి సారి ఆలోచించాలి వస్తుందని తెలిపారు. విశ్రాంతి లేని ఆటకు స్వప్తి పలకాలని నిశ్చయించుకున్నాను. నెగిటివిటీ, భయం, అనిశ్చితినుంచి రిటైర్‌ అవ్వబోతున్నాను. ప్రతీరోజు సోషల్‌ మీడియాలో చదువుతున్న కథనాలను నన్ను నేను ప్రశ్నించుకునేలా చేశాయి.

మనం మరింత సంసిద్ధంగా ఉండాలి. కలిసికట్టుగా వైరస్‌ను ఓడించాలి. మనం ఇప్పుడు తీసుకునే నిర్ణయం మన, మన భావితరాల భవిష్యత్తును నిర్ణయిస్తుంది. వారిని ఓడిపోనివ్వకుండా చూడాలి’’ అని ఆమె పేర్కొన్నారు. కాగా ఆమె చేసిన ట్విట్ పై బిన్నాభి ప్రాయాలు వస్తున్నాయి. ఆమె ఆటకు రిటైర్‌మెంట్ ప్రకటించినట్లు పేర్కొనలేదని అంటున్నారు.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు