ఆవు పేడ కొంటాం అంటున్న కేంద్రం… కిలో ఎంతో తెలుసా ? కొత్త పథకం ఎప్పటి నుండి అమల్లోకి..

cow dung purchase : దేశంలో ఆవుల సంతతి రోజు రోజుకు తగ్గిపోతుంది. వీటి సంతతిని పెంచి రైతులను ఆర్థికంగా బలపరిచేందుకు కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తుంది. ఆవు పేడను రూ. 2కి కొనుగోలు చెయ్యాలని పార్లమెంటరీ స్థాయి సంఘం కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది. రైతుల నుంచి పేడను సేకరించి వర్మీ కంపోస్ట్ తయారు చేసి తిరిగి రైతులకే విక్రయించాలని సూచించింది. కాగా ఈ పథకాన్ని ప్రస్తుతం ఛత్తీస్ ఘడ్ ప్రభుత్వం అమలు చేస్తుంది. రైతుల నుంచి పేడను సేకరించి దానిని వర్మీ కంపోస్ట్ మార్చి కిలో 8 రూపాయలకు విక్రయిస్తుంది. ఛత్తీస్ ఘడ్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఈ పథకం ద్వారా రైతులకు మేలు జరుగుతుంది.

ప్రకృతి సేద్యం వైపు అడుగులు

దేశంలో అత్యధిక మంది రైతులు రసాయనాలను వాడే పంటలు పండిస్తున్నారు. గత కొన్నేళ్లుగా రసాయనాలు వాడకం విపరీతంగా పెరిగింది. ఇది ప్రజా ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. రైతులు రసాయనాలకు స్వస్తి చెప్పి సేంద్రియ వ్యవసాయం వైపుకు తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తుంది. ఈ నేపథ్యంలోనే ఆవు పేదతో ముందు మొదలు పెట్టి ఆ తర్వాత నెమ్మదిగా ఆవు ద్వారా వ్యవసాయానికి కావలసిన ఉత్పత్తులను తయారు చెయ్యవచ్చని పార్లమెంటరీ స్థాయి సంఘం కేంద్రానికి తెలిపింది. ఆవుపేడను కొనడం వలన సంరక్షణ లేని ఆవులను కూడా దత్తత తీసుకునే అవకాశం ఉందని పార్లమెంటరీ స్థాయి సంఘం కేంద్రానికి సూచించింది.

ఇక ఇప్పటికే ఈ పథకం ఛత్తీస్ ఘడ్ లో అమలవుతుంది. రైతుల దగ్గర రూ. 2 చొప్పున కొనుగోలు చేసి దానిని వర్మీ కంపోస్టుగా మార్చి తిరిగి రైతులకే విక్రయిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం 2020 నుంచే ఈ పథకాన్ని అమలు చేస్తుంది. దీని ద్వారా రైతులు లాభపడుతున్నారు. కేజీ రూ. 2 అంటే ప్రభుత్వానికి కూడా పెద్ద భారం పడదు. ఇక దానిని ప్రోసెసింగ్ చేసి వర్మీ కంపోస్టు తయారు చేయడవం వలన ప్రభుత్వానికి లాభం చేకూరుతుంది. ఇటు ఈ పథకం ఇటు రైతుకు, అటు ప్రభుత్వానికి మేలు చేస్తుంది. దింతో రైతుల నుంచి కూడా మంచి స్పందన వస్తుంది.

దేశంలో ఈ పథకం పెడితే

దేశంలో ఈ పథకం పెడితే సుమారు 20 కోట్లమంది రైతులు లాభపడతారు. ప్రస్తుతం ఆవులను పెంచేందుకు రైతులు ఇష్టపడటం లేదు. కేంద్రం ఈ పథకాన్ని ఇంప్లిమెంట్ చేస్తే తిరిగి రైతులు ఆవులను కొనే అవకాశం ఉంటుంది. దేశంలో 15 కోట్ల ఆవులు ఉన్నట్లుగా వివిధ గణాంకాల ద్వారా తెలుస్తుంది. వీటిలో చాలా వరకు రైతుల వద్దనే ఉన్నాయి. ఇక ఈ పథకం ప్రవేశపెడితే గోశాలలు నడిపే వారికి కూడా ఆర్ధిక భరోసా ఇచ్చినట్లు అవుతుంది. దేశంలోని అనేక గోశాల్లలో ఐదు కోట్లకు పైగా ఆవులు ఉన్నాయి. వీటి పోషణ కష్టంగా మారింది. కొన్ని ప్రాంతాల్లో గ్రాసం దొరక్క.. అధిక ఖర్చుపెట్టి కొనలేక ఆవులను వదిలేస్తున్నారు. ఆవు పేడ కొనే పథకం వస్తే ఇటువంటి ఘటనలు చోటుచేసుకోవు. వాటి పోషణ పేడ ద్వారా వచ్చే డబ్బుకు సరిపోతుంది.

ఆవు పేడ కొంటాం అంటున్న కేంద్రం… కిలో ఎంతో తెలుసా ? కొత్త పథకం ఎప్పటి నుండి అమల్లోకి..

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు