రెమిడెసివర్ ఇంజక్షన్ : ఇండియా గురించి అర్థం కాక బుర్ర బద్ధలు కొట్టుకుంటున్న అంతర్జాతీయ మీడియా

international media over india's situaion

ప్రపంచం వింతలో భారతదేశంలోని ఆస్పత్రి వ్యవస్థను చేర్చాలని భారతదేశ ప్రజలే కాదు అంతర్జాతీయ మీడియా, ఆయా దేశ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. అవును.. ఇప్పుడు ఇదే మాట ప్రతి ఒక్కరి నుంచి వస్తుంది. కరోనా రోగులకు అత్యవసర పరిస్థితుల్లో అందించే రెమిడెసివర్ ఇంజక్షన్ బ్లాక్ మార్కెట్ దందా ఏంటో.. మీడియాలో ఆఫ్ నాలెడ్జ్ వార్తలు ఏంటో ఎవరికీ అర్థం కావటం లేదు..

కరోనా రోగి ఆస్పత్రిలో జాయిన్ అయ్యాడు.. అతనికి రెమిడెసివర్ ఇంజక్షన్ అవసరం అయ్యింది.. పేషెంట్ వివరాలతో ట్రీట్ మెంట్ చేసే డాక్టర్ ఇంజక్షన్ కావాలని ప్రిస్క్రిప్షన్ రాస్తే.. ప్రభుత్వం లేదా తయారీ కంపెనీలు దాన్ని సరఫరా చేస్తాయి. ఇంత సింపుల్ గా అయిపోయే పనికి.. బ్లాక్ మార్కెట్ దందా ఏంటీ.. డాక్టర్ అవసరం అని రాసినా.. ఎందుకు దొరకటం లేదు.. తప్పు ఎక్కడ జరుగుతుంది అనే విషయాన్ని 10 రోజులుగా ఎవరూ గుర్తించకపోవటం ఏంటో.. ఈ వైద్య ఆరోగ్య శాఖ వ్యవస్థ ఏంటో ఎవరికీ అర్థం కావటం లేదు అంటోంది అంతర్జాతీయ మీడియా.

భారతదేశంలో తప్పితే.. బంగ్లాదేశ్, పాకిస్థాన్, ఆఫ్ఘనిస్తాన్, అమెరికా, ఇంగ్లాండ్ ఇలా ప్రపంచంలోని అన్ని దేశాల్లో రోగికి అవసరం అయిన మందులు డాక్టర్ రాశాడు అంటే కంపెనీలు ఇచ్చి తీరాలి లేదా ప్రభుత్వం అత్యవసరంగా ఏర్పాటు చేయాలి. అలా జరగని పక్షంలో ఎమర్జెన్సీ కింద ఆస్పత్రులను, కంపెనీలను స్వాధీనం చేసుకుని రోగుల ప్రాణాలను కాపాడుతాయి అక్కడి ప్రభుత్వాలు .

భారతదేశంలోనే విచిత్ర పరిస్థితి కనిపిస్తుందని అంతర్జాతీయ మీడియా ఆశ్చర్యం వ్యక్తం చేస్తుంది. ఆస్పత్రులు, డాక్టర్లే ప్రజల ప్రాణాలతో వ్యాపారం చేయటం.. శవాలతో డబ్బులు సంపాదించటం జరుగుతుందని అవాక్కవుతుంది.

కరోనా రోగికి ట్రీట్ మెంట్ చేస్తున్న ఆస్పత్రికి, వైద్యం అందిస్తున్న డాక్టర్కే ఇంజక్షన్ దొరక్కపోతే సామాన్యులకు ఎలా లభిస్తుంది అనే బేసిక్ పాయింట్ ను ఎవరూ పట్టించుకోవటం లేదని.. ఈ దిశగా ప్రజలు సైతం ఆలోచించటం లేదంటూ బుర్ర బద్దలు కొట్టుకుంటుంది అంతర్జాతీయ మీడియా.

భారతదేశంలోనే తయారయ్యే ఇంజక్షన్లు భారతీయులకు.. అక్కడి ఆస్పత్రుల్లోనే అందుబాటులో లేకపోవటం చూస్తుంటే.. భారతదేశంలో వైద్య రంగం ఎంత దుస్థితిలో.. ఎంత అస్తవ్యస్థంగా ఉందో చెప్పటానికి ఇదో ఎగ్జాంపుల్ అంటోంది అంతర్జాతీయ మీడియా.

రెమిడెసివర్ ఇంజక్షన్ బ్లాక్ మార్కెట్ దందా అంటూ హాఫ్ నాలెడ్జ్ వార్తలను వండి వారుస్తున్న మీడియా.. రోగుల బంధువుల బయట ఎందుకు తిరగాలి.. ట్రీట్ మెంట్ కోసం ఇంజక్షన్ ఇవ్వాల్సిన బాధ్యత ఆస్పత్రికి, డాక్టర్ లేవా అనే అంశాన్నే విస్మరించటం ప్రపంచంలోని వింతలో వింత అంటున్నారు. ప్రభుత్వం దగ్గరే లేవు అంటే ప్రజలకు ఎక్కడి నుంచి దొరుకుతాయి అంటున్నారు.. బేసిక్ అంశాన్ని వదిలేసి పైపై పూతలతో ప్రజలను పిచ్చోళ్లను చేయొద్దు సామీ

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు