హైదరాబాద్ లో గంధపు చెట్ల స్మగ్లింగ్ కలకలం

హైదరాబాద్ లో గంధపు చెట్ల స్మగ్లింగ్ కలకలం

హైదరాబాద్ లో గంధపు చెట్ల స్మగ్లింగ్ కలకలం

Sugerly -News,Politics,Fact Check,Viral,Life Style and Film News

హైదరాబాద్ లోని పలు పార్కులలో గంధపు చెట్లను నాటారు అధికారులు. అవి పెరిగి పెద్దవి అయ్యాయి. ఈ నేపథ్యంలోనే ఆదివారం ఇందిరాపార్క్ లో 13 గంధపు చెట్లను నరికారు. నరికిన ప్రదేశంలోనే చెట్టును వేశారు. అయితే తెల్లారి వచ్చే చూసే సరికి నరికిన చెట్లు పడేసిన ప్రాంతంలో కనిపించలేదు. దింతో అప్రమత్తమైన పార్క్ సిబ్బంది గాంధీ నగర్ పోలీసులకు సమాచారం ఇచ్చారు.

ఇందిరా పార్క్ లో గంధపు చెట్లు నరికివేత

దింతో పోలీసులు పార్కును పరిశీలించారు. సీసీ కెమెరాను పరిశీలించారు. ఆదివారం ఒక్క‌రోజే 13 గంధ‌పు చెట్లు న‌రికివేసిన‌ట్లు పార్క్ అధికారులు పోలీసుల‌కు ఇచ్చిన ఫిర్యాదులో వివరించారు. కాగా వీటిని చెట్లను కోసే కట్టర్ తో కోసినట్లుగా ఆనవాళ్లు లభించాయి. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని, త్వరలోనే చెట్లను నరికిన వారిని పట్టుకుంటామని తెలిపారు.

కాగా దీని వెనుక ఎవరైనా పెద్దల హస్తం ఉందా అనే కోణంలో విచారిస్తున్నారు అధికారులు. సిబ్బంది సహకరించారా అనే కోణంలో కూడా విచారిస్తున్నారు.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు