హుజూరాబాద్ ఉప ఎన్నికపై ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఏం చెబుతోంది..

హుజూరాబాద్ ఉప ఎన్నికపై ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఏం చెబుతోంది..

హుజూరాబాద్ ఉప ఎన్నికపై ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఏం చెబుతోంది..

తెలంగాణ రాష్ట్రంలో రాజకీయం అంతా ఈటెల రాజేందర్ చుట్టూనే తిరుగుతుంది. అన్ని పార్టీల్లోనూ హుజూరాబాద్ హీట్ కనిపిస్తోంది. ఈ ఉప ఎన్నిక లేకపోతే 50 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ వస్తుందా ఏంటీ అంటూ బీజేపీ కౌంటర్ చేయటం మొదలుపెట్టిన తర్వాత.. అందరి దృష్టి అసలు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఏం చెబుతుంది అనే ఆరా మొదలైంది.

కొన్ని వర్గాల్లో జరుగుతున్న చర్చను పరిశీలిస్తే.. హుజూరాబాద్ పై తెలంగాణ ప్రభుత్వం ఫ్లాష్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తెప్పించుకున్నట్లు సమాచారం. నియోజకవర్గంలో ఈటెల రాజేందర్ కు మంచి పలుకుబడి ఉందని.. వ్యక్తిగత ఇమేజ్ కలిసి వస్తుందనే సారాంశం అందులో ఉందంట. అదే విధంగా టీఆర్ఎస్ పార్టీలో ఇప్పటి వరకు అంతా తానై వ్యవహరించటంతో.. ఈటెల తర్వాత ఆ స్థాయిలో టీఆర్ఎస్ పార్టీ లీడర్ లేకపోవటం పార్టీకి మైనస్ గా మారిందంట. సీనియర్ నేతగా, ఉద్యమ కారుడిగా, మంత్రిగా పవర్ లో ఉండటంతో నెంబర్ 2 అనేది పార్టీ సైతం ఆలోచించలేదు.. ఆ స్థాయికి ఎవరూ వెళ్లలేదు.

ఇదే ఇప్పుడు హుజూరాబాద్ ఉపఎన్నికలో టీఆర్ఎస్ పార్టీకి మైనస్ కాబోతున్నట్లు సమాచారం. హుజూరాబాద్ నియోజకవర్గం ప్రజల అభిప్రాయం.. ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ద్వారా చూసిన తర్వాత సీఎం కేసీఆర్ 50 వేల ఉద్యోగాల భర్తీని ప్రకటించారని.. డబుల్ బెడ్ రూం ఇళ్ల ప్రారంభం వేగవంతం చేశారనేది బీజేపీ, కాంగ్రెస్ మాటలుగా వినిపిస్తున్నాయి.

ఇంటెలిజెన్స్ రిపోర్ట్ లో టీఆర్ఎస్ గెలుపు ఆషామాషీ కాదని.. చాలా బలంగా.. గట్టిగా పోరాడాల్సిన పరిస్థితి ఉందని చెబుతున్నారు. నాగార్జునసాగర్ లో బీజేపీ అభ్యర్థి వీక్ కావటం టీఆర్ఎస్ పార్టీకి కలిసి వచ్చిందని.. సిట్టింగ్ సీటులోనే మాజీ మంత్రి జానారెడ్డిని ఓడించటానికి సీఎం కేసీఆర్ ఏకంగా భారీ బహిరంగ సభ పెట్టాల్సి వచ్చింది.. అలాంటిది ఈటెల రాజేందర్ ఎదుర్కోవటానికి.. అందులోనూ బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగుతుండటం చూస్తుంటే.. కేసీఆర్, కేటీఆర్ లకు ఇది అగ్నిపరీక్షగా చెబుతున్నాయి ప్రత్యర్థి పార్టీలు.

తెర వెనక బీజేపీకి పరోక్షంగా కాంగ్రెస్ మద్దతు ఇచ్చినా ఆశ్చర్యం లేదని.. టీఆర్ఎస్ ఓటమి లక్ష్యంగా శత్రువులు చీకటి ఒప్పందం చేసుకునే అవకాశాలు ఉన్నాయనే ఇంటెలిజెన్స్ నివేదికలు కేసీఆర్ కు చేరాయనే టాక్ బీజేపీ, కాంగ్రెస్ పార్టీల్లో వినిపిస్తున్నాయి.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు