ఏడాది పాటు కరోనాతో జివించాల్సిందే : ఒక్క నెలలో వ్యాక్సిన్ సాధ్యం కాదు : తేల్చేసిన సీఎం జగన్

cm jagan tirupati tour cancel

ఏపీ రాష్ట్రంలో కరోనా కట్టడి.. రోగులకు అందుతున్న చికిత్స.. ఇతర అంశాలపై హైలెవల్ మీటింగ్ ఏర్పాటు చేశారు సీఎం జగన్. కరోనా కేసుల కట్టడిపై చర్చించారు. ఏప్రిల్ 28వ తేదీ.. బుధవారం ఒక్క రోజే 14 వేల 792 కేసులు నమోదయ్యాయి. 57 మంది చనిపోయారు. కరోనా సెకండ్ వేవ్ లో ఇది ఆల్ టైం హై.. 10 వేల లోపు వస్తున్న కేసులు.. ఒక్కసారిగా దాదాపు 15 వేలకు చేరుకోవటంతో అధికారులు అప్రమత్తం అయ్యారు.

కరోనా పాజిటివ్ కేసలు దాదాపు 15 వేలకు చేరుకోవటంపై సీఎం జగన్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. అందరికీ వ్యాక్సిన్ ఇవ్వటానికి చాలా సమయం పడుతుందని.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన వ్యాక్సిన్ ఆర్డర్ ప్రకారం.. అందరికీ వ్యాక్సినేషన్ పూర్తి చేయాలంటే జనవరి నెలాఖరు వరకు పడుతుందన్నారు.

18 నుంచి 45 ఏళ్లలోపు అందరికీ వ్యాక్సిన్ ప్రారంభించటానికి సెప్టెంబర్ నెల అవుతుందని.. ఈ లోపు 45 ఏళ్లు పైబడిన అందరికీ రెండు డోసుల వ్యాక్సిన్ కంప్లీట్ చేయాలని ఆదేశించారు సీఎం జగన్. సెప్టెంబర్ నెల నుంచి 18 నుంచి 45 ఏళ్లలోపు ఉన్న 2 కోట్ల 40 లక్షల మందికి రెండు డోసుల వ్యాక్సిన్ ఇవ్వటం ప్రారంభం అవుతుందన్నారు. సెప్టెంబర్ నాటికి రాష్ట్రానికి 14 కోట్ల డోసులు కావాలని.. ఆ దిశగా కేంద్రం, వ్యాక్సిన్ తయారీ కంపెనీలతో మాట్లాడి వెంటనే వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అప్పటి వరకు ప్రజలు అందరూ అప్రతమత్తంగా ఉండాలన్నారు.

ప్రస్తుతం ఉన్న పరిస్థితులు 2022 జనవరి నెలాఖరు వరకు ఉంటాయని స్పష్టం చేశారు.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు