తిరుపతిలో బీజేపీకి 2 లక్షల ఓట్లు వస్తే.. జగన్ తడిగుడ్డ వేసుకుని పడుకోవచ్చు.. 2024లో మళ్లీ 151 ఖాయం

తిరుపతిలో బీజేపీకి 2 లక్షల ఓట్లు వస్తే.. జగన్ తడిగుడ్డ వేసుకుని పడుకోవచ్చు.. 2024లో మళ్లీ 151 ఖాయం

తిరుపతి ఉప ఎన్నికలో బీజేపీకి ఎన్ని ఓట్లు వస్తాయి అనేదే ఇప్పుడు పాయింట్.. గెలుపోటములు అనేది అందరూ ఊహించేదే అయినా.. ఏ పార్టీ ఎన్ని ఓట్లు సాధిస్తుంది అనేది ఇక్కడ పాయింట్. ముఖ్యంగా.. బీజేపీ-జనసేన పొత్తులో భాగంగా బరిలోకి దిగిన రత్నప్రభకు రెండు లక్షల ఓట్లు వస్తే మాత్రం.. సీఎం జగన్ తడిగుడ్డ వేసుకుని పడుకోవచ్చు.. 2024లోనూ 151 సీట్లు ఖాయం అనేది అంతర్గ రాజకీయ విశ్లేషణ.

ఇదేం లెక్క అనుకునే వారికి.. లోతుగా ఇస్తున్న విశ్లేషణ ఇది. 2011 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టినప్పటి నుంచి.. 2021లోని పంచాయతీ, మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల వరకు జరిగిన ప్రతి ఎన్నికల్లోనూ 41 శాతంపైనే ఓట్లు తగ్గకుండా వస్తూ ఉన్నాయి. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఏకంగా 51 శాతం ఓట్లతో 151 సీట్లు గెలుచుకుంది. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నికరంగా 41 శాతం ఓట్లు ఉన్నాయి.

అధికారంలోకి వచ్చి రెండేళ్లు అవుతున్న సమయంలో.. ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో జరుగుతున్న లోక్ సభ ఉప ఎన్నికలో కొత్త వ్యూహానికి తెర తీశారు జగన్. ప్రతిపక్షాన్ని వీక్ చేయాలంటే.. అది మరో ప్రతిపక్షం అయితే చాలు అనేది ఓ పాయింట్. ఉప ఎన్నికలో బీజేపీ రెండు లక్షల ఓట్లు సాధించినట్లయితే.. కచ్చితంగా ఈ ఓట్లు అన్నీ టీడీపీవి. అంటే ప్రధాన ప్రతిపక్షం వీక్ అయ్యి.. ప్రతిపక్ష పార్టీకి.. మరో ప్రతిపక్షం తయారైనట్లే.

2019 లోక్ సభ ఎన్నికల్లో టీడీపీకి 4 లక్షల 94 వేల ఓట్లు వచ్చాయి. బీజేపీ, జనసేన పార్టీలు కలుపుకుని 36 వేల ఓట్లు మాత్రమే వచ్చాయి. ఇప్పుడు బీజేపీ 2 లక్షలు ఓట్లు సాధించి.. టీడీపీ 2 లక్షల ఓట్లకు పడిపోతే.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంచనా ప్రకారం.. గత ఎన్నికలతో పోల్చితే కనీసం మరో లక్ష మెజార్టీ వస్తే మాత్రం.. జగన్ వ్యూహం సక్సెస్ అయినట్లే. 2019 ఎన్నికల్లో వైసీపీకి 7 లక్షల 22 వేల ఓట్లు వచ్చాయి.. మెజార్టీ 2 లక్షల 28 వేల ఓట్లు. ఈసారి మెజార్టీ కనీసంలో కనీసం లక్ష పెరగాలనేది వైసీపీ వ్యూహం.

ఈ లెక్కన బీజేపీ రెండు లక్షలు, వైసీపీ ఓ లక్ష మెజార్టీ తీసుకుంటే.. టీడీపీకి వచ్చే ఓట్లు 2 లక్షలుగానే ఉంటుంది. అంటే ప్రతిపక్షం టీడీపీకి.. బీజేపీ-జనసేన రూపంలో మరో ప్రతిపక్షం స్ట్రాంగ్ గా తయారైనట్లే.

తిరుపతి ఉప ఎన్నికలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుకున్నట్లు జరిగితే.. 2024 ఎన్నికల్లో సీఎం జగన్ మళ్లీ 151 సీట్లు గెలుచుకోవటం కష్టం ఏమీకాదు.. తడిగుడ్డ వేసుకుని పడుకోవచ్చు. సెకండ్ – థర్డ్ ప్లేస్ వాళ్లు కొట్టుకుంటే.. మొదటి స్థానం ఎప్పుడూ స్థిరంగానే ఉంటుంది కదా..

మరి బీజేపీకి రెండు లక్షల ఓట్లు వస్తేనే సీఎం జగన్ హ్యాపీ.. అలా కాకుండా బీజేపీ లక్ష కంటే తక్కువగా ఓట్లు సాధించి.. 2019 ఎన్నికల్లో మాదిరిగా టీడీపీ 4 లక్షల 94 వేల ఓట్లు సాధించినట్లయితే మాత్రం.. జగన్ బయటకు రావాల్సిందే.. రోడ్డెక్కి కష్టపడాల్సిందే..

లాస్ట్ బట్ నాట్ లీస్ట్.. 2019 ఎన్నికల్లో 79.76 శాతం పోలింగ్ నమోదైంది.. ఈసారి నమోదయ్యే పోలింగ్ శాతం ఆధారంగా ఓట్ల మెజార్టీ మారిపోవచ్చు.. దీన్ని గుర్తించుకోవాలి.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు