బెయిల్ రద్దు పిటీషన్.. బెయిల్ కోసం పిటీషన్.. రెండూ ఒకే రోజు వస్తున్నాయి.. ఈ టైమింగ్ ఏంటయ్యా..

బెయిల్ రద్దు పిటీషన్.. బెయిల్ కోసం పిటీషన్.. రెండూ ఒకే రోజు వస్తున్నాయి.. ఈ టైమింగ్ ఏంటయ్యా..

jagan vs raghu rama
jagan vs raghu rama

బెయిల్ రద్దు పిటీషన్.. బెయిల్ కోసం పిటీషన్.. రెండూ ఒకే రోజు వస్తున్నాయి.. ఈ టైమింగ్ ఏంటయ్యా..

టైం అందరి దూల తీర్చేస్తుంది.. మనం ఎవర్ని అయితే టార్గెట్ చేస్తామో.. వాళ్లకూ అదే జరుగుతుంది అనటానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుగుబాటు ఎంపీ రఘురామకృష్ణం రాజు విషయంలో జరిగింది. మే 14వ తేదీ.. 60వ పుట్టిన రోజు.. అందులోనూ శుక్రవారం రోజు అరెస్ట్ అయిన ఎంపీకి.. మరో చేదు టైమింగ్ సైతం వెంటాడటం విశేషం.

ప్రస్తుతం అరెస్ట్ అయిన ఎంపీ రఘురామకృష్ణం రాజు.. సీఎం జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ సీబీఐ కోర్టులో పిటీషన్ వేశారు. విచారణ చేసిన కోర్టు.. వివరణ ఇవ్వాలంటూ నోటీసులు పంపింది. సమాధానం చెప్పటానికి టైం ఇస్తూ.. విచారణను మే 17వ తేదీకి వాయిదా వేసింది.

ఇప్పుడు అరెస్ట్ అయిన రఘురామ కృష్ణం రాజు సైతం యాదృశ్చికంగా మే 17వ తేదీన తన బెయిల్ పిటీషన్ కోర్టులో దాఖలు చేయనున్నారు.

సీఎం జగన్ బెయిల్ రద్దు పిటీషన్ విచారణ జరగాల్సిన మే 17వ తేదీనే.. తనకు బెయిల్ కావాలంటూ పిటీషన్ దాఖలు చేయటం అంటే విశేషమే కదా..

మే 14వ తేదీ శుక్రవారం సాయంత్రం హైదరాబాద్ లో అరెస్ట్ అయిన రఘు రామకృష్ణం రాజును విజయవాడ తరలించారు. శుక్రవారం రాత్రికి విజయవాడ చేరుకుంటారు. శనివారం అంతా కరోనా పరీక్షలు, విచారణ జరిగిపోతుంది. ఆదివారం సెలవు.. మే 17వ తేదీ సోమవారం.. కోర్టులో బెయిల్ పిటీషన్ దాఖలు చేస్తారు.

ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ అయ్యింది.. బెయిల్ రద్దు పిటీషన్ విచారణ రోజే.. ఎవరైతే పిటీషన్ వేశారో.. అదే వ్యక్తి బెయిల్ కోసం కోర్టులో పిటీషన్ వేయటం భలే టైమింగ్ అంటున్నారు.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు