పవన్ కల్యాణ్ పాదయాత్ర ప్లాన్ రెడీ

pawankalyan_padayatra

సినిమాలతో బిజీగా ఉన్న పవన్ కల్యాణ్.. తన రాజకీయ భవిష్యత్ పైనా దృష్టి పెట్టారు. ఏపీలో రాజకీయంగా ఉన్న గ్యాప్ లో జనసేన పార్టీని బలోపేతం చేయాలనే ఉద్దేశంతో వ్యూహాత్మకంగా ముందుకు సాగాలని నిర్ణయించి.. అందుకు తగ్గట్టుగా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేశారు. తిరుపతి లోక్ సభ ఉప ఎన్నిక ఫలితాల తర్వాత.. ఎండాకాలం ముగిసిన తర్వాత పాదయాత్ర చేపట్టాలని నిర్ణయించారు.

జూన్ నెల నుంచి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేపట్టాలని నిర్ణయించిన పవన్ కల్యాణ్.. ఇదే సమయంలో సినిమాలను కూడా చేస్తూ ముందుకు సాగనున్నారు. వారంలో మూడు రోజులు పాదయాత్ర.. మరో మూడు రోజులు సినిమా షూటింగ్స్.. ఒక రోజు రెస్ట్ తీసుకుంటూ రెండేళ్ల పాటు పాదయాత్ర ద్వారా జనంలో ఉండాలని నిర్ణయించారు. ఇందుకు సంబంధించి పార్టీ వ్యూహకర్తలతోపాటు ఆప్తులు అయిన మీడియా ప్రతినిధులతో చర్చించి ఈ డెసిషన్ తీసుకున్నారు.

ఆదివారం రెస్ట్ తీసుకోనున్న పవన్ కల్యాణ్.. సోమ, మంగళ, బుధవారాల్లో షూటింగ్ లో పాల్గొంటారు. గురు, శుక్ర, శనివారాలు మాత్రం పాదయాత్ర చేయనున్నారు. ఈ పాదయాత్ర ఏ జిల్లా నుంచి ప్రారంభించాలి అనేది ఇంకా డిసైడ్ కాలేదు. జూన్ నెలలో మాత్రం కచ్చితంగా ఉంటుందని జనసేన పార్టీ నేతలు చెబుతున్నారు.

జనసేన పార్టీ నిర్మాణం, కార్యకర్తలు, నేతల్లో ఉత్సాహం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం బీజేపీతో పొత్తులో ఉన్న జనసేన పార్టీ.. అందులో నుంచి బయటకు వచ్చి పాదయాత్ర ప్రారంభిస్తారా లేక పొత్తు పొత్తే.. పార్టీ పార్టీనే అంటూ ముందుకు సాగుతారా అనేది ఇంకా నిర్ణయం కాలేదు. పాదయాత్రకు ముందే బీజేపీతో పొత్తుపై కీలక ప్రకటన ఉంటుందని మాత్రం చెబుతున్నారు. బీజేపీతో పొత్తు కంటిన్యూ చేస్తూనే.. పాదయాత్ర చేస్తే ప్రయోజనం ఉండదని కొంత మంది సలహా ఇస్తున్నారు పవన్ కల్యాణ్ కు.. ఆయన నిర్ణయం ఎలా ఉంటుంది అనేది వేచిచూడాలి.

 

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు