భాజపా మా కొంప ముంచింది – జనసేన

ఆంధ్రప్రదేశ్ లో ఆదివారం మునిసిపల్ ఎన్నికల ఫలితాలు విడుదలైన విషయం తెలిసిందే.. ఈ ఫలితల్లో అధికార వైసీపీ ప్రభంజనం సృష్టించింది. 73 మునిసిపాలిటీలను కైవసం చేసుకుంది. ఇక ఇదే వ్యవహారంపై జనసేన అధికార ప్రతినిధి పోతిన మహేష్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్బంగా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీతో పొత్తు పెట్టుకోవడం వలన జనసేనకు భారీ నష్టం జరిగిందని అన్నారు. కూటమిగా ఏర్పడ్డం వల్ల మైనార్టీలంతా తమను వ్యతిరేకించారని ఆరోపించారు. ఎన్నికల్లో ఓటమికి కారణాలపై పార్టీ అధిష్ఠానానికి నివేదిక అందిస్తామన్నారు.

విజయవాడలో బీజేపీకి భారీ నష్టం జరిగినట్లు వివరించారు మహేష్.. ఎస్సీ, ఎస్టీ, ముస్లింలు వ్యతిరేకించారని, ప్రచారానికి వెళ్ళినప్పుడు కూడా తమను వారు అనేక ప్రశ్నలు వేశారని తెలిపారు. ప్రజల నుంచి వ్యతిరేకత రావడంతో గెలుస్తామనుకున్న స్థానాల్లో కూడా ఓటమి చవిచూసినట్లు తెలిపారు. కరోనా సమయంలో తాము ప్రజల మధ్య ఉండి అనేక సేవాకార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. ఓటమి గెలుపుగా మారడానికి ఐదేళ్లు పడుతుందని వివరించారు.

విజయవాడలో ఎక్కడైనా భాజపా మాకు అండగా నిలబడిందా అని ప్రశ్నించారు. జెండా పట్టుకునే మనిషే మాకు కరవైపోయారు. పశ్చిమ నియోజకవర్గంలోని భాజపాకు కీలకమైన స్థానాల్లో గెలపించడానికి మేం పనిచేయలేదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. వీటన్నింటిపై రెండు రోజుల్లో అధిష్ఠానికి నివేదిస్తా” అని పోతిన మహేశ్‌ అన్నారు. భాజపాతో పొత్తుపై విలేకర్లు అడిగిన ప్రశ్నకు సమాధానం చెబుతూ.. దీనిపై అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు