నమస్తే బైడెన్.. భారత్ కోరితే సాయం చేస్తాం.. కరోనా కట్టడికి ముందుకొచ్చిన అమెరికా..

joe biden stammer

భారతదేశంలో కరోనా వైరస్ వ్యాప్తి ప్రపంచాన్ని భయపెడుతోంది. ఏప్రిల్ 21వ తేదీ లెక్కల ప్రకారం.. ప్రపంచంలోనే అత్యధిక కేసులు ఇండియాలో నమోదయ్యాయి. ఒక్క రోజులోనే 3 లక్షల 14 వేల పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. 2 వేల 200 మంది చనిపోయారు. ఇవన్నీ ప్రభుత్వ లెక్కలు మాత్రమే. ఇక కరోనా పరీక్షల సంఖ్య పెంచితే ఇంకెన్ని బయటపడతాయో అనే భయం ప్రజలను వణికిస్తోంది. కేంద్రం లెక్కల ప్రకారం దేశంలో 23 లక్షల యాక్టివ్ కేసులు ఉన్నాయి.

మహారాష్ట్రలో అత్యధికంగా 67 వేల కేసులు నమోదైతే.. ఆ తర్వాత ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో 33 వేలు, ఢిల్లీలో 24 వేలు, కర్ణాటకలో 23 వేలు, కేరళలో 22 వేల కేసులు నమోదయ్యాయి. మిగతా అన్ని రాష్ట్రాల్లోనూ 10 వేల కేసులకు దగ్గరలో ఉన్నాయి.

భారతదేశంలో నమోదవుతున్న కేసులు.. ప్రపంచంలోనే నెంబర్ వన్ స్థానంలో ఉంది. ఈ పరిణామాలతో ఇంగ్లాండ్, అమెరికాతో సహా కొన్ని దేశాలు భారత్ కు విమాన సర్వీసులను నిలిపివేశాయి. ఇదే సమయంలో అమెరికా అధ్యక్షుడు బైడెన్ భారత్ కు అండగా నిలిచారు. ఇండియాలో కరోనా కట్టడికి అవసరం అయిన సాయం చేస్తామని స్పష్టం చేశారు.

భారతదేశంలో కరోనా కేసులు, వైరస్ వ్యాప్తిని అమెరికా నిశితంగా పరిశీలిస్తుంది.. ఎలాంటి సాయం చేయటానికి అయినా సిద్ధంగా ఉన్నాం.. మందులు, వ్యాక్సిన్, ఇతర వైద్య సామాగ్రి అందించటానికి రెడీగా ఉన్నాం అంటూ ముందుకొచ్చారు.

గతంలో నమస్తే ట్రంప్ అంటూ మొదటి విడతలో కరోనా వ్యాప్తి విస్తరించారనే అపవాదు ఉంది.. ఇప్పుడు అదే అమెరికా కొత్త అధ్యక్షుడు బైడెన్ సాయం చేయటానికి ముందుకొచ్చారు. ఈసారి మీకు నమస్తే బైడెన్ అంటున్నారు జనం.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు