బీజేపీలో చేరిన జర్నలిస్ట్ సంగప్ప

తన ఎజెండా ఏంటో స్పష్టం చేశారు. గ్రౌండ్ లెవల్ సమస్యలు ఏంటో తెలిసిన వాడిగా.. నియోజకవర్గంలో మహిళలు పడుతున్న...

Journalist Sangappa join BJP Party
Journalist Sangappa join BJP Party

తెలంగాణ జర్నలిస్ట్, వీ6 న్యూస్ ఇన్ పుట్ ఎడిటర్ సంగప్ప జనవరి 1వ తేదీ బీజేపీలో జాయిన్ అయ్యారు. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.. సంగప్పకు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. తనతోపాటు నారాయణఖేడ్ నియోజకవర్గం నుంచి తన అనుచరులను కూడా భారీ సంఖ్యలో పార్టీలోకి తీసుకెళ్లారు.

తెలంగాణ ఉద్యమం నుంచి ప్రజల బాధలను దగ్గరుండి చూశానని.. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒరిగింది ఏమీ లేదన్నారు. ప్రజాసేవ చేయటానికి.. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఇక నుంచి ప్రత్యక్ష పోరాటం చేస్తానన్నారు సంగప్ప

ఫస్ట్ డేనే.. పొలిటికల్ స్పీచ్ మొదలుపెట్టిన సంగప్ప.. నారాయణఖేడ్ నియోజకవర్గంలో తీవ్రంగా ఉన్న మంచినీటి సమస్యను ప్రస్తావించి.. తన ఎజెండా ఏంటో స్పష్టం చేశారు. గ్రౌండ్ లెవల్ సమస్యలు ఏంటో తెలిసిన వాడిగా.. నియోజకవర్గంలో మహిళలు పడుతున్న మంచినీటి సమస్యకు పరిష్కారం దిశగా తొలి రాజకీయ పోరాట అడుగు వేస్తున్నట్లు చెప్పేశారు.

ఇన్నాళ్లు జర్నలిస్టుగా గుర్తింపు ఇచ్చిన వీ6 న్యూస్ చైర్మన్, బీజేపీ సీనియర్ నేత వివేక్ ఆధ్వర్యంలోనే పార్టీలో చేరటం విశేషం. ఇన్నాళ్లు ఉద్యోగం ఇచ్చిన కృతజ్ణత కూడా చూపించారు సంగప్ప. వీ6 న్యూస్ ఛానల్ పెట్టటానికి సంగప్ప కారణం అంటూ వివేక్ సైతం తన అభిమానాన్ని చాటుకున్నారు.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు