NTRకు కరోనా పాజిటివ్.. ఫ్యామిలీ మొత్తం ఐసోలేషన్.. ఫోన్ లో పరామర్శించిన చెర్రీ, కళ్యాణ్ రాం

jr ntr tested corona postive

జూనియర్ ఎన్టీఆర్ కు కరోనా పాజిటివ్ అని నిర్థారణ అయ్యింది. స్వల్ప లక్షణాలు ఉండటంతో పరీక్ష చేయించుకోగా పాజిటివ్ వచ్చింది. దీంతో వెంటనే ఐసోలేషన్ లోకి వెళ్లిపోయారు హీరో. ఆయనతోపాటు భార్య లక్ష్మీ ప్రణీత, ఇద్దరు పిల్లలు సైతం ఇంట్లోనే క్వారంటైన్ అయ్యారు. మూడు, నాలుగు రోజులుగా తనను కలిసిన వారు కరోనా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు ఎన్టీఆర్.

ఎన్టీఆర్ కు కరోనా పాజిటివ్ అని తెలిసిన వెంటనే.. సినీ ఇండస్ట్రీ షాక్ అయ్యింది. అభిమానులు ఆందోళన చెందారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఎన్టీఆర్ ఓ మెసేజ్ ఇచ్చారు. స్వల్ప లక్షణాలు మాత్రమే ఉన్నాయని.. మిగతా ఎలాంటి బాధ లేదని.. ఇతర అనారోగ్య సమస్యలు లేవని.. ఆరోగ్యంగానే ఉన్నానని స్పష్టం చేశారు ఎన్టీఆర్. సినీ ప్రముఖులు, అభిమానులు పెద్ద ఎత్తున గెట్ వెల్ సూన్ అంటూ మెసేజ్ చేస్తున్నారు.

ఇంట్లోనే ఐసోలేషన్ అయిన ఎన్టీఆర్ ఫ్యామిలీని పరామర్శించారు అతని స్నేహితుడు రాంచరణ్, సోదరుడు కళ్యాణ్ రాం. ఆస్పత్రి నుంచి కావాల్సిన సహాయ సహకారాలు, డాక్టర్ల పర్యవేక్షణ బాధ్యతను వీళ్లు తీసుకున్నారు. ఇంట్లో నుంచి బయటకు వచ్చే పరిస్థితి లేదు కాబట్టి ఎల్లవేళ్లలా ఎలాంటి సాయం అందించటానికి అయినా సిద్ధంగా ఉన్నాం.. డోంట్ వర్రీ అంటూ మనోదైర్యం చెప్పారు.

అభిమానులు అయితే గెట్ వెల్ సూన్ అంటూ ట్విట్టర్ ద్వారా తమ విషెస్ చెబుతున్నారు.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు