జడ్జిలకు ఫైవ్ స్టార్ హోటల్ లో కరోనా ట్రీట్ మెంట్.. 100 గదులు బుక్ చేసిన ప్రభుత్వం..

జడ్జిలకు ఫైవ్ స్టార్ హోటల్ లో కరోనా ట్రీట్ మెంట్.. 100 గదులు బుక్ చేసిన ప్రభుత్వం..

Judges booked VVIP COVID care in Five Star Ashoka Hotel.
Judges booked VVIP COVID care in Five Star Ashoka Hotel.

కరోనాకు తన, మన బేధం లేకపోయినా ప్రభుత్వానికి స్పష్టంగా ఉంది.. పేదలకు ఒకలా.. డబ్బున్నోళ్లకు ఒకలా ట్రీట్ మెంట్ చేస్తోంది. ముఖ్యంగా ప్రభుత్వంలోని పెద్దలకు కరోనాకు ఇచ్చే ట్రీట్ మెంట్ విషయంలో వందల కోట్లు ఖర్చు చేయటానికి సైతం వెనకాడటం లేదు ప్రభుత్వాలు.

ఢిల్లీ ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలు దేశవ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి. ఢిల్లీ హైకోర్టు జడ్జీలు, న్యాయ శాఖలోని అధికారులు కరోనా బారిన పడితే ట్రీట్ మెంట్ చేయటానికి.. ఫైవ్ స్టార్ హోటల్ లోని 100 గదులు బుక్ చేసింది ప్రభుత్వం. హైకోర్టు జడ్జిలతోపాటు వారి కుటుంబ సభ్యులకు కరోనా బారిన పడితే.. వాళ్లను క్వారంటైన్ చేయటానికి ఏకంగా ఐదు నక్షత్రాల హోటల్ బుక్ చేసింది ప్రభుత్వం. దీని కోసం కోట్ల రూపాయల నిధులు ఖర్చు చేయటానికి వెనకాడటం లేదు.

ఈ నిర్ణయంపై ఢిల్లీ ప్రజలు అవాక్కయ్యారు. ఆమ్ ఆద్మీ పార్టీ వ్యవహారశైలిపై ట్విట్టర్ లో దుమ్మెత్తిపోస్తున్నారు. ఢిల్లీలో సామాన్యుల దుస్థితి ప్లాట్ ఫాంగా ఉంటే.. వీవీఐపీలకు స్టార్ హోటల్ లో ట్రీట్ మెంట్ ఇవ్వటానికి సిద్ధం అయ్యారని.. ఆమ్ ఆద్మీ అని చెప్పుకునే పార్టీ ఇలా చేయటం ఏంటని ప్రశ్నిస్తున్నారు ప్రజలు.

ఢిల్లీలో కరోనాతో చనిపోయిన వారికి అంత్యక్రియలు చేయటానికి రెండు రోజుల సమయం పడుతుంది.. ఎలాంటి దుస్థితిలో ఢిల్లీ ఉందో అర్థం అవుతుంది.. ఇలాంటి సమయంలో కరోనా బాధితులు అందర్నీ ఒకేలా చూడాల్సిన ప్రభుత్వం.. అందరికీ ఒకే న్యాయం అని చెప్పే న్యాయ స్థానం పెద్దలు.. ఇప్పుడు ఏకంగా మేం స్పెషల్.. మాకు స్పెషల్ ట్రీట్ మెంట్ అని చెప్పటం చూస్తుంటే.. దేశంలో న్యాయం ఎవరి పక్షమో అర్థం అవుతుంది.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు