బైడెన్ గెలుపులో కీలకపాత్ర పోషించిన తెలుగు వ్యక్తి కేఏ పాల్

కేఏ పాల్ ఈ పేరు తెలుగువారికి సుపరిచితం.. తెలుగు మీడియా ఛానెల్స్ లో ఎప్పుడు కనిపిస్తూనే ఉంటారు. పీస్ మిషన్ పేరుతొ ప్రపంచ వ్యాప్తంగా పర్యటనలు చేస్తుంటారు పాల్. ఆయనకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పెద్ద పెద్ద నేతలతో పరిచయాలు ఉన్నాయి. ఇక ప్రపంచ వ్యాప్తంగా ప్రార్ధనలు చేస్తూ శాంతి దూతగా పేరుతెచ్చుకున్నారు.

బైడెన్ గెలుపులో కీలకపాత్ర పోషించిన తెలుగు వ్యక్తి కేఏ పాల్

పాల్ ప్రపంచంలో కొన్ని యుద్ధాలను కూడా ఆపారు. దీనికి సాక్షాలు కూడా ఉన్నాయి. కానీ పాల్ తెలుగు రాష్ట్రాలకు వచ్చేసరికి ఇక్కడి ప్రజలకు కమెడియన్ గా కనిపిస్తారు.. ఇలా ఆయనకు తెలుగు ప్రజలు అర్ధం చేసుకోవడానికి తెలుగు మీడియా చేసిన పుణ్యమే అని చెప్పవచ్చు. ఇక ఇప్పుడు పాల్ గురించి ఇంతగా ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంటే, ట్రంప్ ఓటమిని ఆస్వాదిస్తూ అమెరికా విధుల్లో డాన్స్ చేశారు. పాల్ డాన్స్ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

కాగా పాల్ మొదటినుంచి ట్రంప్ ఓడిపోతారనే చెబుతూ వచ్చారు. తన మద్దతు బైడెన్ కు ప్రకటించారు. గత ఏడాది కాలంగా ట్రంప్ ఓటమికోసం శ్రమిస్తున్నానని వెల్లడించారు. ట్రంప్ ను గతంలోనే హెచ్చరించానని, కానీ ట్రంప్ తన మాట వినలేదని తెలిపారు. ఆయనపై ఓ పుస్తకం కూడా రాసి ఎలుగెత్తానని వివరించారు. ఇక తన మద్దతు బైడెన్ కె అని ప్రకటించారు.

 

 

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు