కాకినాడ వైసీపీలో విషాదం

కాకినాడ వైసీపీలో విషాదం

తూర్పుగోదావరి జిల్లా కాకినాడ వైసీపీలో విషాదం చోటుచేసుకుంది. కాకినాడ సిటీ వైసీపీ అధ్యక్షుడు ఫ్రూటీ కుమార్ కరోనాతో మృతి చెందారు. కొద్దీ రోజుల క్రితం కరోనా సోకడంతో అతడిని విశాఖలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.

పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. నాలుగు రోజులక్రితం జగన్ వారి కుటుంబ సబ్యులకు ఫోన్ చేసి పరామర్శించారు. వైఎస్సార్‌సీపీ ఆవిర్భావం నుంచి ఫ్రూటీ కుమార్ పార్టీకి ఎనలేని కృషి చేశారు.

గత ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ కూడా ఆశించారు. ఆయన మరణం పట్ల పార్టీ నేతలు తీవ్ర విచారం వ్యక్తం చేశారు.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు