కవితకు శుభాకాంక్షల వెల్లువ… రవీంద్రభారతిలో 60 అడుగుల చిత్రం

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ముద్దుల తనయ, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత శనివారం పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆమెకు పుట్టిన రోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. హైదరాబాద్ రవీంద్రభారతిలో కల్వకుంట్ల కవిత 60 అడుగుల చిత్రాన్ని ఏర్పాటు చేశారు. ఎమ్మెల్సీ కవితకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ నేలపై 60 అడుగుల భారీ చిత్రాన్ని ఏర్పాటు చేశారు. నిజామాబాద్‌కు చెందిన టీఆర్ఎస్ యువనేత కవిత మీద అభిమానంతో ఈ చిత్రాన్ని…ఏర్పాటు చేశారు. మహారాష్ట్రకు చెందిన ప్రఖ్యాత చిత్రకారుడు శైలేష్ కులకర్ణి కవిత చిత్రాన్ని వేశారు. ఈ చిత్రం వేసేందుకు 20 గంటలకు పైగా కళాకారులు శ్రమించారు.

కవితకు శుభాకాంక్షల వెల్లువ… రవీంద్రభారతిలో 60 అడుగుల చిత్రం

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు